సినిమా సెలబ్రెటీస్ కోసం..పొలిటీలకే లీడర్స్ కోసం వారిని అభిమానించే అభిమానులు కత్తులు దూసుకోవడం…సోషల్ మీడియా నుంచి సొసైటీ మూలాల వరకూ యుద్దాలు చేసుకోవడం షరా మామూలే.
[m9ad]
అయితే దాన్ని అభిమానం అని అనాలో…లేక పైచ్యం అని సరిపెట్టుకోవాలో తెలీదు కానీ వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు…కానీ మనం మనం కొట్టుకు చస్తున్నాం…
ఆ మధ్య పవన్ పార్టీ పెట్టినప్పుడు చిరు-పవన్ విడిపోయారు అంటూ నానా రకాల యాగీ చేసి…ఆ కుటుంభం అభిమానులు రెండు గ్రూపులుగా విడిపోయి పెద్ద రచ్చే చేశారు…ఇక ఆ తర్వాత ఆ ఇద్దరు హీరోలు ఒకే స్టేజి పై కనిపించడంతో…అమాయకత్వంతో..ఆశ్చర్యపోతూనే ఆనందంలో మునిగి తేలడం ఆ అభిమానుల వంతు అయ్యింది.
నిన్నటికి నిన్న కూడా జూనియర్ ఎన్ఠీఆర్ కి బాలయ్య కి మధ్య వారికే తెలియని అగాదం ఉంది అంటూ సోషల్ మీడియా సాక్షిగా జరుగుతున్న రభసకు ఫుల్ స్టాప్ పడింది..వాళ్ళు నిన్న ఒకే వేదికను పంచుకోగా..నిన్నటివరకూ కత్తులు దూసుకున్న వారు మరో మారు అమాయకత్వంతో..ఆశ్చర్యపోతూనే ఆనందంలో మునిగి తేలారు..
ఇక్కడ అందరూ గమమించాల్సిన విషయం ఏంటి అంటే రక్తం పంచుకు పుట్టిన వారికోసం మనం రకరకాలుగా యుద్దాలు చెయ్యడం ఇకనైనా ఆపెయ్యాలి అని…మరి ఈ జాడ్యం పోయెనా..ఆ మార్పు కలిగేనా? చూద్దాం ఎన్నటికో…ఎప్పటికో!



