క్రిస్మస్ కి ఎంతమంది వస్తారు రా నాయనా?

Balakrishna - KS Ravi Kumar movie release in decemberతెలుగు సినిమాల సీజన్ పూర్తి కావొస్తుంది. దసరా తరువాత పెద్ద సీజన్ అంటే సంక్రాంతే. చిన్న, మీడియం సినిమాలకు మాత్రం మధ్యలో క్రిస్మస్ ఉంది. ఆ సెగ్మెంట్ లో చాలా సినిమాలు పెండింగ్ ఉండటంతో క్రిస్మస్ కు బాక్స్ ఆఫీసు వద్ద రష్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకూ నాలుగు సినిమాలు క్రిస్మస్ కు రావడానికి సిద్ధం అవుతున్నాయి. నితిన్ భీష్మ, సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే, రవితేజ డిస్కో రాజా ఇప్పటికే క్రిస్మస్ కు వస్తున్నట్టు ప్రకటించేశాయి.

ADVERTISEMENT

దిల్ రాజు తన డిస్ట్రిబ్యూటర్లకు శర్వానంద్, సమంత నటించిన 96 రీమేక్ కూడా క్రిస్మస్ కే విడుదల చెయ్యబోతున్నారు చెప్పేశాడు. 20న శుక్రవారం, 21న శనివారం సినిమాల విడుదల ఉన్న రెండే ఆప్షన్స్. మొదటి వారంలో క్రిస్మస్ (బుధవారం) రూపంలో ఇంకో సెలవు దొరుకుతుంది అంతే. అదేమీ పెద్ద సీజన్ ఏమీ కాదు నాలుగైదు సినిమాలు విడుదల కావడానికి. బాలయ్య కేఎస్ రవికుమార్ చిత్రం కూడా క్రిస్మస్ కే విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

చివరికి ఇందులో ఎన్ని ఉంటాయో ఎన్ని ఊడతాయో. క్రిస్మస్ మిస్ అయితే ఈ సారి న్యూ ఇయర్ కు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే న్యూ ఇయర్ బుధవారం వచ్చింది. అయితే న్యూఇయర్ పెద్దగా కలిసి రాదు టాలీవుడ్ కు. ఆడియన్స్ సంక్రాంతి సినిమాలకు డబ్బులు సేవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒకవేళ క్రిస్మస్, న్యూ ఇయర్ కాదంటే… రిపబ్లిక్ డేకో, లేక ఫిబ్రవరి కో వెళ్లాల్సిందే. ఏ నిర్మాతకూడా అంత లేటు చెయ్యడానికి ఇష్టపడడు.

ADVERTISEMENT
Latest Stories