పవన్ మనసులో మాటలన్నీ బాలయ్య చెప్పించి ఉంటారా

Balakrishna pawan kalyan కొన్ని కలయికలు తెరమీద చూడలేకపోయినా ఓటిటిల పుణ్యమాని స్మార్ట్ స్క్రీన్ల మీద సాధ్యమవుతున్నాయి. అందులో నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఒకటి. వ్యక్తిత్వం, ముక్కుసూటిగా వ్యవహరించడం ఇలా ఇద్దరి శైలిలో చాలా పోలికలే కనిపిస్తాయి. అందుకే అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కి పవర్ స్టార్ ప్రత్యేక అతిథిగా వస్తాడని లీక్ వచ్చినప్పటి నుంచి అది అఫీషియల్ అయ్యే దాకా ఫ్యాన్స్ లో మంచి ఎగ్జైట్ మెంట్ కనిపించింది. ప్రభాస్ కు సైతం ఇంతే హైప్ వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో అది గూస్ బంప్స్ ఇవ్వలేదు. స్క్రిప్ట్ లో డార్లింగ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ప్రభాస్ పెళ్ళెప్పుడు గురించే ఎక్కువ చర్చ జరగడం వల్ల వచ్చిన చిక్కది.

ఇప్పుడు పవన్ భాగం మీద అంతకంతా అంచనాలు విపరీతంగా ఉన్నాయి. టీజర్ గట్రా చూస్తుంటే కంటెంట్ గట్టిగానే కనిపిస్తోంది. అన్నయ్య చిరంజీవిలో నచ్చని నచ్చిన లక్షణాల గురించి చెప్పమని బాలయ్య అడగడం, ఇదే నా చివరి సినిమాని వదిన సురేఖతో పవన్ చెప్పిన పాత సంఘటన లాంటివి ఆసక్తికరంగా ఉన్నాయి. బాలా అని పిలవమని అడిగినా పవన్ ఓడిపోవడానికి సిద్ధమని ఒప్పేసుకోవడం డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. ఈ మధ్య రాజకీయ విమర్శల్లో పవన్ పదును పెంచిన అంశం గురించి ఇద్దరి మధ్య చర్చకు వచ్చింది.

ADVERTISEMENT

అన్నిటికన్నా ముఖ్యమైనది కోట్లాది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా అదంతా ఓట్ల రూపంలోకి జనసేనకు అనుకూలంగా మారడం లేదనే ప్రశ్న బాలకృష్ణ అడగటం అందరి మనస్సులో ఉన్నదే. దానికి ఏం సమాధానం వచ్చి ఉంటుందా అనేది సస్పెన్స్ లో పెట్టేశారు. నిడివి తక్కువగా ఉన్నప్పటికీ జనాల్లో ఆసక్తి పెరిగేలా ఈసారి బాగానే డిజైన్ చేశారు. వీ ఆర్ బ్యాడ్ బాయ్స్ అంటూ చివర్లో పవన్ బాలయ్య చేతులు కలిపేసుకుని వెళ్లడం వెరైటీగా ఉంది. ఎప్పుడనేది చెప్పలేదు కానీ కమింగ్ సూన్ అని ఊరించి వదిలేసింది ఆహా.

ఇప్పుడీ భాగం కోసం సినిమా ప్రియుల్లోనే కాదు పొలిటికల్ సర్కిల్స్ లోనూ హైప్ ఉంది. పవన్ ఏం మాట్లాడితే దాన్ని పట్టేసుకుని ప్రెస్ మీట్లలో, బయట పబ్లిక్ ఉన్న చోట మైకుల్లో కౌంటర్లు ఇచ్చేందుకు తహతహలాడుతున్న మంత్రులు ఎంఎల్ఏలు రిలీజ్ కావడం ఆలస్యం చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక అభిమానుల సంగతి సరేసరి. పవన్ ని భీమ్లా నాయక్ తర్వాత మళ్ళీ సినిమాలో కానీ బయట ఈవెంట్ లో చూసే అవకాశం దక్కలేదు. ఇప్పుడీ అన్ స్టాపబుల్ లో పర్సనల్ విషయాలు చాలా మాట్లాడబోతున్న నేపథ్యంలో స్ట్రీమింగ్ మొదలు కాగానే క్రాష్ కాకుండా ఆహా ముందే తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

ADVERTISEMENT
Latest Stories