బరిలోకి బాలయ్య చిన్నల్లుడు కూడా?

Balakrishna Second Son in law harat into politicsమెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా హల్చల్ చేస్తోన్న సమాచారం ప్రకారం… నందమూరి నటసింహం బాలకృష్ణ చిన్నల్లుడు కూడా బరిలోకి దిగే విధంగా సన్నాహాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈయన ఎంట్రీ సినీ రంగంలో కాదు, రాజకీయ రంగంలో!

ADVERTISEMENT

గీతం అధినేత ఎంవీవీఎస్ మూర్తి విశాఖ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తూ తెలుగుదేశం పార్టీలో పావులు కదుపుతున్నారని, ఒకవేళ తనకు అవకాశం లేని పక్షంలో తన మనవడైన బాలయ్య చిన్నల్లుడు భరత్ కు టికెట్ మంజూరీ చేసేలా పార్టీ నేతలను కోరినట్లు సమాచారం. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు గానీ, బాలకృష్ణ కూడా తన చిన్నల్లుడుని రాజకీయ రణరంగంలోకి దించేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే పెద్దల్లుడు, సిఎం తనయుడు నారా లోకేష్ పార్టీలో సేవలు అందిస్తున్నందున, చిన్నల్లుడు కూడా అదే బాటలో పయనించాలని బాలయ్య ఆశిస్తున్నారట. ప్రస్తుతం విశాఖలో ఉన్న గంటా శ్రీనివాస్ ను లోక్ సభ నుండి బరిలోకి దింపాలని, గంటా స్థానంలో భరత్ ను బరిలోకి దింపాలని సాగుతున్న చర్చలు ఎంతవరకు కార్యరూపం సిద్ధించుకుంటాయో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories