Telugu

బండి వివాదం బిఆర్ఎస్ కి లైన్ క్లియర్ చేసిందా.?

బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై ఫోక్సో కేసు, ఆ పై లొంగుబాటు, అరెస్టు వంటి వివాదాలకు తోడు తాజాగా బండి భగీరథ్ పై మరికొన్ని బలమైన సెక్షన్ల కింద కేసులు నమోదుకావడంతో బండి సంజయ్ కి రాజకీయం ఇబ్బందులు తప్పడం లేదు.

కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి గా ఉన్న బండి సంజయ్ కుటుంబంలోని వ్యక్తి పై ఇన్ని కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు కావడం, న్యాయం చెయ్యాల్సిన స్థానంలో ఉన్న వారి నుండే న్యాయం కావాలి అంటూ బాధిత కుటుంబం న్యాయస్థానం బాట పట్టడంతో బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చెయ్యాలనే డిమాండ్ ప్రత్యర్థి పార్టీల నుండి బలంగా వినిపిస్తుంది.

ADVERTISEMENT

అయితే ఈ వివాదం పై అటు టి. బీజేపీ నేతలు సైతం బాధితులకు న్యాయం జరగాలి అంటూ బాధిత పక్షానే ప్రకటనల చేయడంతో టి. బీజేపీ లో సన్ స్ట్రోక్ దెబ్బకు బండి సంజయ్ ఒంటరి వాడయ్యారు అనే వాదన వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీ టార్గెట్ తెలంగాణ అంటూ బీజేపీ అధిష్టానం నుంచి వచ్చిన ప్రకటనలు ఇప్పుడు బండి భగీరథ్ వివాదంతో కనుమరుగవ్వబోతున్నాయా అన్న ప్రశ్న తలెత్తుతుంది.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా టి. బీజేపీ ముందుకెళ్లాలి అని భావించిన ఇటువంటి కీలక తరుణంలో ఇప్పుడు బండి వివాదం టి. బీజేపీ లో రాజకీయ కల్లోలానికి దారి తీసిందనే చెప్పాలి. అయితే అధికారం లేకుంటే ప్రతిపక్షం అనే నినాదంతో ఎన్నికల బరిలో దిగాలనుకున్న టి.బీజేపీ కి అనుకోని విధంగా కేసుల రూపంలో రాజకీయ విపత్తు ఎదురయిన సందర్భంగా తెలంగాణలో రాజకీయంగా రెండవ స్థానంలో ఉన్న బిఆర్ఎస్ సేఫ్ ప్లేస్ లోకి వచ్చినట్టయ్యింది.

రాబోయే ఎన్నికలకు బిఆర్ఎస్ కు కాళేశ్వరం, ఫోన్ టాపింగ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులు ఉన్నట్టే, బండి భగీరథ్ ఫోక్సో కేసు నేర నిరూపణ జరిగితే టి. బీజేపీ కి ఈ కేసు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగా మారుతుంది. బిఆర్ఎస్ కేసుల విషయంలో ఆ పార్టీ నేతలు ఈ కేసులు రేవంత్ సర్కార్ రాజకీయ కక్ష్య సాధింపు లో భాగమే అంటూ ప్రచారం చేసుకుని వాటి పరిధిని కుందించే అవకాశం ఉంటుంది.

కానీ భగీరథ్ పై కేసు బండి కుటుంబానికి వ్యతిరేకంగా ఉంటె మాత్రం బీజేపీ విషయంలో ఆ వెసులుబాటు ఉండకపోవచ్చు. ఇది ఒక రకంగా బిఆర్ఎస్ కి రాజకీయంగా లైన్ క్లియర్ చేసినట్టే. త్రిముఖ పోటీ నుంచి ఒక పార్టీ రాజకీయంగా ఎదురుదెబ్బలు తింటే అది ప్రతిక్షంలో ఉన్న బిఆర్ఎస్ కి రాజకీయంగా లైన్ క్లియర్ చేసినట్టే.

ఇక అప్పుడు తెలంగాణలో అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షంగా ఎన్నికల యుద్ధం సాగుతుంది. ఇందులో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్ష బిఆర్ఎస్ కు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. మరి ఈ అంది వచ్చిన అవకాశాన్ని బిఆర్ఎస్ ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.

 

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

YSRCP Protesting, Jagan Missing, No One Caring?

Unlike the Telugu Desam party, which is a fundamentally strong decades-old institution with a strong…

23 minutes ago

Peddi Premieres in Risk? Sudden Silence Creates Confusion

Ram Charan and Janhvi Kapoor starrer Peddi is easily the most awaited Telugu film right…

43 minutes ago