పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ ఇండైరెక్టు విసుర్లు?

Bandla Ganesh Satire on Pawan Kalyanకరోనా పెను భూతమై ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. రాజూ పేద అనే తేడా లేకుండా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. టాలీవుడ్ లో కరోనా బారిన పడిన మొదటి సెలబ్రిటీ నిర్మాత బండ్ల గణేష్. ఇటీవలే ఆయన కోలుకున్నారు. ఈరోజు బండ్ల వరుస ట్వీట్లతో చిరంజీవిపై పొగడ్తలు కురిపించారు.

ADVERTISEMENT

కష్టంతో పైకి వచ్చిన వాళ్ళకి కష్టం తెలిసిన వాళ్లకి ఏ అండ లేకుండా కొండగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మనసు ప్రేమ అ అనురాగం ఆప్యాయతలు ఉంటాయన్నా అందుకు మీరే ఉదాహరణ. యావత్ ఇండస్ట్రీ మిమ్మల్ని చూసి నేర్చుకుంటే బాగుంటుందని ఆశ. వందేళ్లు మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎలా ఉన్నావు అన్న మీ పరామర్శ మాకు కొండంత బలం తెలియని ఆనందం ఎంతో సంతోషం ధన్యవాదాలు అన్నగారు అంటూ ట్వీట్ చేశాడు బండ్ల గణేష్.

అయితే చిరంజీవిని పొగిడినట్టే పొగిడి బండ్ల పవన్ కళ్యాణ్ పై ఇండైరెక్టుగా విమర్శలు చేశారా? అనే ఒపీనియన్ వినిపిస్తుంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ కరోనా నుండి తేరుకున్నాకా పవన్ కళ్యాణ్ తనను కనీసం పరామర్శించలేదని చెప్పుకొచ్చారు. అయితే ఆయనకు తనకు కరోనా సోకిన విషయం తెలీదని సరిపెట్టుకుంటున్నా అని చెప్పుకొచ్చారు ఆయన.

దీనితో పవన్ కళ్యాణ్ ని దెప్పడానికే చిరంజీవి మీద పొగడ్తలు కురిపిస్తున్నడని పలువురి అభిప్రాయం. గతంలో బండ్ల పవన్ కళ్యాణ్ తీన్మార్, గబ్బర్ సింగ్ చిత్రాలు నిర్మించారు. ఆ తరువాత ఎందుకు చెందిందో గానీ పవన్ కళ్యాణ్ ఆయనను దూరం పెట్టారు.

ADVERTISEMENT
Latest Stories