ఎవరు సార్ లోకల్ నాన్ లోకల్… బండ్ల గణేష్ మాస్

Bandla ganesh supports prakash rajఎప్పుడో సెప్టెంబర్ లో జరిగే మా ఎన్నికల వేడి ఇప్పటికే రాజుకుంది. ఇప్పటికే నలుగురు ‘మా’ అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమ ఈ పోటీకి సిద్ధమవుతున్నట్లుగా ప్రకటించారు. రేస్ లో ప్రకాష్ రాజ్ ముందు పని మొదలుపెట్టినట్టుగా ఉంది.

ADVERTISEMENT

ఇప్పటికే టీవీ డిబేట్లకు హాజరవుతున్న ఆయన, తాజాగా ఇరవైఏడు మంది తో తన ప్యానల్ ను ప్రకటించి వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రకాష్ రాజ్ కు మద్దతుగా మెగా బ్రదర్ నాగబాబు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ నాన్-లోకల్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.

“లోకల్.. నాన్‌లోకల్ అంటూ కొందరు విమర్శిస్తున్నారు.. అవార్డులు వచ్చినప్పుడు నాన్‌లోకల్ ప్రస్తావన ఎందుకు రాలేదు? రెండు గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు నాన్‌లోకల్ అనలేదే? కళాకారులు లోకల్ కాదు.. యూనివర్సల్. కోపంతో పుట్టింది కాదు,” అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో బండ్ల ఒక మెంబర్ అనే విషయం తెలిసిందే.

బండ్ల గణేష్ తనదైన శైలిలో ఈ ప్రచారాన్ని తిప్పుకొట్టారు. ” లోకల్ నాన్ లోకల్ ఏంటి సార్ ఇక్కడ? నాన్ లోకల్ లోకల్ అంటూ… ఇక్కడ పుట్టిన ప్రభాస్ ఇండియాని ఏలుతున్నాడు ఇవ్వాళ,” అని చెప్పుకొచ్చారు. బండ్ల వేసిన ఈ డైలాగు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories