అల్లుడికి ఇంకా ఆ మత్తు వదలలేదా?

Bellamkonda Sreenivas Star Power On Stake As He Joins Summer Madnessయంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ చాలా కాలం నిరీక్షణ తరువాత రాక్షసుడుతో హిట్ కొట్టాడు. ఆ తరువాత ‘కందిరీగ’, ‘ర‌భ‌స’ చిత్రాల ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీ‌నివాస్ రౌతు ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు. ఆ చిత్రానికి అల్లుడు అదుర్స్ అనే టైటిల్ కంఫర్మ్ చేశారు. దీని బట్టి ఆయన మరోసారి కమర్షియల్ సినిమా వైపు మొగ్గు చూపుతున్నాడని అర్ధం అవుతుంది.

ADVERTISEMENT

అల్లుడు శీను సినిమాతో తెరంగేట్రం చేసిన బెల్లంకొండ ఆ సినిమాతో కాసులు బాగానే రాబట్టినా బడ్జెట్ అంతకంటే ఎక్కువ కావడంతో ఉపయోగం లేకుండా పోయింది. ఆ తరువాత మాస్ హీరో గా నిలబడాలని ఆయన చెయ్యని ప్రయత్నం లేదు. దీనితో వరుసగా ఆరు సినిమాలు ప్లాపులుగా నిలిచాయి.

ఏడవ సినిమా రాక్షసుడుతో రూట్ మార్చడంతో హిట్ కొట్టాడు బెల్లంకొండ. దీనితో రొటీన్ మాస్ సినిమాలు కాకుండా ఏదన్నా విభిన్నంగా ట్రై చేస్తేనే వర్క్ అవుట్ అవుతుందని బెల్లంకొండకు అర్ధం అయ్యి ఉండాలి. కాకపోతే ఇప్పుడు మళ్ళీ మాస్ సినిమా వైపే మొగ్గు చూపుతున్నట్టు అల్లుడు అదుర్స్ అనే టైటిల్ బట్టి అర్ధం అవుతుంది.

ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం స‌న్నాహాలు చేస్తోంది. అంటే మే డే హాలిడే అడ్వాంటేజ్ కోసం సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ తో పోటీ పడబోతున్నాడు. ఆయ‌న స‌ర‌స‌న హీరోయిన్లుగా న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్ న‌టిస్తున్నారు. చాలా కాలం తరువాత సోనూ సూద్ ఈ సినిమాతో తిరిగి తెలుగు సినిమాకి వస్తున్నాడు.

ADVERTISEMENT
Latest Stories