ప్రతీ సినిమా వెనుక కష్టం ఉంటుంది. కానీ ఆ సినిమా ప్రేక్షకుడికి చేరాక కానీ దాని అసలు రంగు బయట పడదు. అయితే కొన్ని సినిమాల కధలను కొందరు హీరోలు రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ముఖ్యంగా పవన్ కాదన్న ఈడియట్…నుంచి ఎన్టీఆర్ కాదన్న భద్ర…మొదలుకొని…యువ హీరో రామ్ కాదన్న ఊసరవెల్లి వరకూ లిస్ట్ ఇలా పెద్దది. అయితే ఆ సినిమా హిట్ అయితేనేమో ఒక రకమైన విమర్శ, ఫ్లాప్ అయితే మరొక రకమైన విమర్శ.
[m9ad]
మరి అలాంటి సంధర్భమే ఒకటి మన యువ హీరో ఒకరికి వచ్చింది. ఆ యువ హీరో పేరు తర్వాత మీకే అర్ధం అవుతుంది కానీ, అసలు మ్యాటర్ ఏంటి అంటే, ఒక కధ కల్యాణ్ రామ్ నుంచి, గోపిచంద్ వరకూ వెళ్ళి, తిరిగి తిరిగి బెల్లంకొండ శ్రీనివాస్ వద్ద ఆగింది. అయితే అందరూ నమ్మని ఆ కధని మన యువ హీరో నమ్మి ఒప్పుకుని సినిమా చేశాడు. అయితే తన కరియర్ కి “కవచం”లా ఉంటుందేమో అనుకున్నా ఆ సినిమా కాస్త భారంగా మారింది. ఈ యువ హీరోకి కవచం సినిమా కాసులు రాల్చలేదు.
అయితే అసలు ఈ సినిమా చెయ్యొద్దురా బాబు అంటూ ఈ కధ విన్న యువ హీరోలు అందరూ ప్రత్యేకంగా చెప్పారట…కానీ ఏం లాభం అలా జరిగింది పోయింది అంతే. అయితే ఇదే సినిమా హిట్ అయ్యీ ఉంటే, ఆ కధను కాదన్న హీరోలు అందరూ “అర్రె..రే! ఆ కధ చేసి ఉంటే బావుండేదే…మిస్ అయ్యాం” అని అప్పట్లో ఎన్టీఆర్ భద్ర…రవితేజ పోకిరి విషయంలో…విషయంలో భాదపడినట్లు బాధ పదే వారు.



