సీనియర్ నిర్మాతకు అరెస్టు వారెంటు

bellamkonda-suresh-court-caseఒకప్పుడు బడా సినిమాలను నిర్మించిన బెల్లంకొండ సురేష్ రెండుమూడేళ్ళగా సైలెంట్ అయిపోయారు. కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాలకు తెరచాటు నుండి ఫైనాన్స్ చేస్తున్నారు. ఒక పాత కేసు ఇప్పుడు ఆయనను వెంటాడి వచ్చి అరెస్టు వారెంట్ దాకా తీసుకుని వెళ్ళింది. 2013లో సిద్ధార్థ్, సమంత జంటగా ఈయన నిర్మించిన జబర్దస్త్ సినిమా ఇప్పుడు ఈయనకు చిక్కులు తెచ్చిపెడుతుంది. హిందీ సినిమా బ్యాండ్ బాజా బారాత్ కాపీ కొట్టి తీసిన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.

దాంతో యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాపై కోర్ట్ కేసు వేసింది. కోర్టు అది నిజమే అని తేల్చడంతో బెల్లంకొండకు షాక్ తప్పలేదు. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన మరో కేసు కూడా ఆయనకు చిక్కులు తెచ్చిపెడుతుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ కేసు వేసిన కారణంగా ఈ చిత్రాన్ని శాటిలైట్ అమ్మవద్దని.. ఏ ఛానెల్ లో ప్రసారం చేయరాదని కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే అప్పటికే ఈ చిత్ర హక్కులను 3.5 కోట్లకు ఓ ఛానెల్ కొనేసింది. కానీ కోర్టు ఆదేశాల మేరకు ఈ సినిమా శాటిలైట్ ఆగిపోవడంతో సదరు ఛానెల్ బెల్లంకొండ సురేష్ ను తమ డబ్బు ఇవ్వాల్సిందిగా కోరింది.

ADVERTISEMENT

పైగా కోర్టు వాయిదాలకు కూడా వెళ్ళకపోవడం తో ఇప్పుడు కోర్టు ఈయనకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. ఇప్పుడు కానీ సరిగ్గా స్పందించకపోతే బెల్లంకొండ సురేష్ జైలుకు వెళ్లడం ఖాయం. మరోవైపు బెల్లంకొండ కుమారుడి కొత్త చిత్రం రాక్షసుడు రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటివరకూ కేరీర్ లో ఒక్క హిట్ కూడా లేకపోవడంతో సీనియర్ బెల్లంకొండ జూనియర్ బెల్లంకొండలు ఈ సినిమా మీద భారీగా ఆశలు పెట్టుకున్నారు. చూడాలి రేపు ఏం జరగబోతుందో!

ADVERTISEMENT
Latest Stories