ఇవైనా అలరిస్తాయా? ప్రేక్షకుల మెప్పును పొందుతాయా?

Bhairava Geetha fateఒక సినిమా రిలీజ్ కి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అందరికీ తెలిసిందే. ఒక సినిమా రిలీజ్ అయ్యీ, హిట్ టాక్ తెచ్చుకుని, ఆ క్రమంలోనే చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావంతో ఆ సినిమాకు వసూళ్లు తెచ్చుకోవడం, బ్రేక్ ఈవన్ కావడం అంటే కత్తి మీద సామే. అయితే గత వారం విడుదలైన మూడు సినిమాలు డిజాస్టర్స్గా మిగిలిపోయాయి. అంటే మరీ తీసి పడేసే సినిమాలు అని చెప్పకపోయినా, రోబో 2.0 ఎఫెక్ట్, పైగా తెలంగాణాలో ఎన్నికల హడావిడి అన్నీ వెరసి ఈ మూడు సినిమాలు వచ్చి వెళ్ళినట్లు పెద్దగా తెలీదు చాలా మందికి.

[m9ad]

ADVERTISEMENT

ఇక మరో పక్క గత వారమే విడుదల అయ్యీ ఆ హడావిడిలో కొట్టుకుపోవాల్సిన వర్మ భైరవగీత థియేటర్స్ ప్రాబ్లమ్ వల్ల గత వారం నుంచి ఈ వారానికి వాయిదా పడగా, మరో సినిమా హుషారు ఈ వారమే విడుదలకు సిద్దం అయ్యింది. ఇక వీటికి ఎన్నికల గొడవ లేదు, పైగా రోబో సినిమా ఎఫెక్ట్ పెద్దగా ఉండబోదు..ఎందుకంటే ఇప్పటికీ దాదాపుగా రోబో సినిమా వసూళ్లు సో సో గా సాగుతున్న క్రమంలో మంచి టాక్ తెచ్చుకోగలిగితే మాత్రం ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసి, నాలుగు కాసులు వెనకేసుకోవచ్చు. ఇక వీటిల్లో ఒకటి భైరవగీత వర్మ బ్రాండింగ్ ఉండడం కాస్త కలసి వచ్చే అంశం కాగా, మరో పక్క ఈ సినిమా కన్నడలో మంచి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.

అయితే వర్మ ట్విట్టర్ లో హడావిడి చేసినంత ఏమీ లేదు కానీ సినిమా, అక్కడ వారికి కాస్త డిఫరెంట్ గా అనిపించడంతో ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది అని చెప్పవచ్చు. ఇక హుషారు విషయమే తీసుకుంటే ఈ సినిమా ట్రైలర్, పాటలు చూస్తూ ఉంటే యువతకు మంచి కిక్ ఇచ్చే సినిమాగా తెలుస్తుంది. మరి పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ లేకుండా, పెద్దగా అడ్డంకులు ఏమీ లేకుండా రిలీజ్ కానున్నా ఈ సినిమాలైనా గత వారం విడుదలైన సినిమాల్లా కాకుండా ప్రేక్షకులను అలరిస్తాయేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories