వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నారు!

Bhairava Geetha  releasing  against Robot 2.0 జూనియర్ ఎన్టీఆర్ ‘అరవింద సమేత’తో పాటు విడుదల చేస్తానని హంగామా చేసి, పబ్లిసిటీ పొందిన రాంగోపాల్ వర్మ నిర్మాణంలో తెరకెక్కిన “భైరవగీత,” అప్పటి నుండి వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తోంది. అనేక తేదీలను ప్రకటించి వాయిదాలు వేస్తూ వస్తోన్న ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ నెల 22వ తేదీన పక్కా విడుదల అని భావించిన తరుణంలో… 30వ తేదీకి రిలీజ్ డేట్ మారడం విశేషం.

[m9ad]

ADVERTISEMENT

అయితే ఈ సినిమాకు ఒక రోజు ముందుగా సూపర్ స్టార్ రజనీకాంత్ – శంకర్ ల “2.0” రానున్న విషయం తెలిసిందే. ఈ సారి ఈ సినిమాతో పోటీపడుతూ పబ్లిసిటీ కొట్టేయాలని భావిస్తున్నారో ఏమో గానీ మరో వారం రోజుల పాటు వాయిదా పడింది. కొత్త దర్శకుడు సిద్ధార్ధ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కన్నడ హీరో ధనంజయ నటిస్తుండగా, హీరోయిన్ గా ఇర్రా మోర్ సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తోంది.

ADVERTISEMENT
Latest Stories