దర్శకుడు మారుతీ అందించిన కాన్సెప్ట్ తో తెరకెక్కిన “భలే మంచి చౌక బేరమ్” సినిమా అక్టోబర్ 5వ తేదీన విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. రెండున్నర్ర గంటల సేపు ధియేటర్ లో ప్రేక్షకులు చూడబోయే కధ ఏంటో, ఈ రెండు నిముషాల ట్రైలర్ లో పూర్తిగా చెప్పేసారు.
[m9ad]
ఆర్మీలో పనిచేసిన రాజా రవీంద్ర రాసిన ఆర్మీ సీక్రెట్ బుక్ ను అమ్ముకోవడానికి చిత్ర ప్రధాన తారాగణం పడే తాపత్రయం… అయితే అది పాకిస్తాన్ కు చెందిన వ్యక్తులకు చేరడం… చివరికి ఆ పుస్తకం ఏమైంది..? అనేది క్లుప్తంగా చిత్రకధ. ఎలాంటి కధనైనా ఎంటర్టైనింగ్ గా చెప్తే ప్రేక్షకులు ‘టైం పాస్’ క్రింద అయినా చూసేస్తారు.
కానీ ఈ రెండు నిముషాల ట్రైలర్ లో ఒక్క సన్నివేశం కూడా ప్రేక్షకులకు వినోదాన్ని అందించలేకపోయింది. బహుశా సిల్వర్ స్క్రీన్ పై చూపించడానికి దాచి ఉంచారో లేక సినిమాలో ఇంతకంటే మంచి సన్నివేశాలు లేవో గానీ, సినిమాపై ఎలాంటి బజ్ ను పెంచడానికి ఈ ట్రైలర్ ఉపయోగపడదు. మారుతీ అందించిన కాన్సెప్ట్ ను మురళీకృష్ణ దృశ్యరూపం తీసుకువచ్చారు.



