యూ ట్యూబ్ లోనా… ధియేటర్ లోనా..!?

bharat-ane-nenu-deleted scenes in youtube‘భరత్ అనే నేను’ సినిమా రన్ టైం రీత్యా కొన్ని మంచి సన్నివేశాలను కూడా తీయాల్సి వచ్చిందని ప్రిన్స్ మహేష్ బాబుతో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా చెప్పిన విషయం తెలిసిందే. సినిమాకు హిట్ టాక్ రావడంతో, ఇప్పుడు అదనపు సన్నివేశాల పేరుతో సినిమాకు యాడ్ చేస్తారన్న టాక్ ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ADVERTISEMENT

ఇదిలా ఉంటే మరో పక్కన కొరటాల శివ ఓ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “కొన్ని మంచి సన్నివేశాలు తీసివేసిన మాట వాస్తవమేనని, వాటిని త్వరలోనే యూ ట్యూబ్ లో ‘డిలిటెడ్ సీన్స్’ పేరుతో విడుదల చేస్తామని స్పష్టం చేసారు. అయితే ఈ సీన్లకు సంబంధించిన డబ్బింగ్ జరుగుతోందని, ఈ వారం నుండే హోలీ ఫైట్ సీన్ తో పాటు ఈ సీన్స్ కు కూడా యాడ్ చేస్తారన్న సమాచారం కూడా అందుతోంది.

దీంతో ప్రిన్స్ అభిమానుల్లో స్పష్టత కొరవడింది. కొత్త సన్నివేశాలు జోడించిన తర్వాత వాటి కోసం అభిమానులు రిపీటెడ్ గా చూడడం అనేది సహజం. దీంతో ఇప్పుడు చూడాలా? సీన్స్ జోడించిన తర్వాత చూడాలా? అన్న దాంట్లో తలమునకలై ఉన్నారు. వీటిపై తమకు అధికారిక ప్రకటన కావాలి అంటూ ప్రిన్స్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories