‘బాహుబలి 2’ రికార్డు కొట్టబోతోంది!

Bharat ane Nenu Movie Chennai Collectionsప్రిన్స్ మహేష్ బాబుకు ఊరటనిచ్చిన “భరత్ అనే నేను” సక్సెస్ రేంజ్ చెన్నైలో ఏకంగా ‘బాహుబలి 2’ రికార్డు బద్దలు కొట్టే విధంగా సాగుతుండడం విశేషం. తెలుగుకు సంబంధించి చెన్నైలో అత్యధిక షేర్ సాధించిన చిత్రాలలో ‘బాహుబలి 2’ ముందు వరుసలో ఉంది. దీని తర్వాత స్థానంలో ‘రంగస్థలం’ నాన్ బాహుబలి రికార్డును కైవసం చేసుకోగా, తాజాగా ‘భరత్ అనే నేను’ ఏకంగా నెంబర్ 1 స్థానంలో నిలుస్తుండడం ఊహించిన పరిణామం కాదు.

తమిళనాడులో మహేష్ కు మంచి మార్కెట్ ఉన్న వాస్తవమే గానీ, అది ఏకంగా ‘బాహుబలి 2’ రికార్డును కొడుతుందని మాత్రం అంచనాలు వేసింది కాదు. బహుశా ఈ ఆదరణ వలనే ఏమో గానీ ‘భరత్ అనే నేను’ సినిమాను తమిళంలోకి డబ్ చేస్తున్నారు. ‘స్పైడర్’ ద్వారా దిగ్విజయంగా తమిళంలోకి అడుగు పెట్టాలన్న ప్రిన్స్ ఆశలు నిర్జీవం కాగా, దీనిని ‘భరత్ అనే నేను’ తీరుస్తుందేమో చూడాలి. స్వయంగా మహేష్ తమిళ డబ్బింగ్ చెప్పనున్నట్లుగా వార్తలు వస్తున్నప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories