ఇది కదా ఫ్యాన్స్ కు కావాల్సిన ఎమోషన్!

bheemla nayak theatrical trailerఇటీవల విడుదలైన “భీమ్లా నాయక్” ధియేటిరికల్ ట్రైలర్ పై సర్వత్రా విమర్శలు రావడంతో, చిత్ర యూనిట్ మరో ట్రైలర్ ను విడుదల చేయక తప్పని పరిస్థితి. ఎందుకంటే ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ తర్వాత, దానిని మించిపోయే విధంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అనేక ట్రైలర్స్ ను కట్ చేసి, యూట్యూబ్ లో రిలీజ్ చేయగా, అసలు ట్రైలర్ ను మించిన స్థాయిలో ఇవి ప్రేక్షకులను మెప్పించాయి.

దీంతో ఫ్యాన్స్ కు కావాల్సిన సరైన స్టఫ్ ను చిత్ర యూనిట్ సిద్ధం చేసి కొత్త ట్రైలర్ ను దించింది. అభిమానులు ఆశించిన థమన్ పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా థీమ్ ప్రేక్షకులకు సరిగా రీచ్ అయ్యేలా ఈ ట్రైలర్ కటింగ్ ఉంది. “అహంకారానికి – ఆత్మగౌరవానికి మధ్య మడమ తప్పని యుద్ధం” అంటూ రానా – పవన్ కళ్యాణ్ ల నడుమ సాగే తీరును ఉదహరించారు.

ADVERTISEMENT

అంతకుముందు ట్రైలర్ తో పోలిస్తే ఈ ట్రైలర్ ఫ్యాన్స్ ను మెప్పించింది గానీ, అప్పటికే ఓ అభిమాని కట్ చేసిన ట్రైలర్ ఈ రెండింటిని మించిపోయే విధంగా ఉండడం గమనార్హం. ఇప్పటివరకు విడుదలైన టీజర్లు, ట్రైలర్ నుండి ఓ పవర్ స్టార్ అభిమాని కట్ చేసిన ట్రైలర్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్ కు ఊపొచ్చే విధంగా థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఈ ట్రైలర్ లో సరిగ్గా కట్ చేసారు.

ADVERTISEMENT
Latest Stories