జూనియర్ ఎన్టీఆర్ ఐ ఫోన్… ఈ హీరో నార్మల్ ఫోన్..!

bigg boss 2 sanjana comments on naniనాచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తోన్న ‘బిగ్ బాస్ 2’ హౌస్ నుండి విజయవాడ అమ్మాయి సంజన తొలివ్యక్తిగా బయటకు అడుగు పెట్టిన విషయం తెలిసిందే. హౌస్ లోకి వెళ్ళిన పది నిముషాలకే జైలు పాలైన సంజన, అంతే ఊపులో కూడా బయటకు రావడం విశేషం. సెలబ్రిటీల జాబితా నుండి కాకుండా సాధారణ ప్రజల లిస్టులో హౌస్ లోకి వెళ్లి వచ్చిన సంజన, ప్రస్తుతం సెలబ్రిటీల మాదిరి ఇంటర్వ్యూలు ఇస్తోంది.

ADVERTISEMENT

తను సాధారణ వ్యక్తుల జాబితాలో వెళ్ళడం వలనే జైలులో వేసారని అనిపించిందని, బహుశా సెలబ్రిటీలు అయితే ఎదురు ప్రశ్నించేవారేమోనని వాపోయింది. తనకు తేజస్వినికి మధ్య ఈగో సమస్యలు తలెత్తాయని, ఆమెను డామినేట్ చేయాలని తాను, తనపై ఆధిపత్యం చూపించాలని ఆమె ప్రయత్నించిందని, అంతకుమించి ఏమీ లేదని చెప్పుకొచ్చింది. కామన్ అమ్మాయిని కాబట్టే తనను తోక్కేసారని ఎలిమినేషన్ పై చెప్పుకొచ్చింది.

ఇక బిగ్ బాస్ 2ని హోస్ట్ చేస్తోన్న నాచురల్ స్టార్ నాని యాంకరింగ్ ను ఉద్దేశిస్తూ… బాగానే చేస్తున్నప్పటికీ, ఐ ఫోన్ ను వాడే వాళ్ళకి మామూలు ఫోన్ ఎలా ఎక్కదో, ఎన్టీఆర్ షో చూసిన వాళ్లకి నాని షో అలా ఎక్కదని అభిప్రాయపడింది. తాను ఎక్స్ పోజింగ్ చేయలేదని, పక్కనోళ్ళను ఇంప్రెస్ చేయలేకపోయానని, సాఫ్ట్ గా అందరికీ బిస్కెట్లు వేయలేకపోయాను, ఇవన్నీ చేస్తేనే బిగ్ బాస్ హౌస్ లో ఉంటారని తీవ్ర విమర్శలు చేసింది. నందిని రాయ్ ని లోపలకు పంపించడానికే తనను బయటకు పంపించారని ఒకింత ఆగ్రహాన్ని కూడా ప్రదర్శించింది.

ADVERTISEMENT
Latest Stories