వరుస షాక్ లు ఇస్తోన్న కౌషల్!

bigg boss Kaushal into Guinness book of World Recordsతన పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కాబోతోందని చెప్పి పెద్ద షాక్ ఇచ్చిన కౌషల్, తాజాగా మరో షాకింగ్ ప్రకటన చేసాడు. అతి త్వరలోనే తాను ‘డాక్టరేట్’ కాబోతున్నానని చెప్పిన కౌషల్, అది ఏ యూనివర్సిటీ ఇస్తోందో కూడా స్పష్టంగా తెలిపాడు. కానీ ఎందుకు వచ్చింది? అన్న అంశాన్ని దాచిపెడుతూ, త్వరలో తాను మళ్ళీ చెప్తానని అన్నారు.

[m9ad]

ADVERTISEMENT

సదరు యూనివర్సిటీ నుండి అధికారిక సమాచారం తనకు వచ్చిందని, మన ‘కౌషల్ ఆర్మీ’కి ఈ సంతోషకరమైన సమాచారాన్ని తెలియజేయడానికి వచ్చానని చెప్పిన కౌషల్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్న స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక ‘బిగ్ బాస్’ విజేతకు డాక్టరేట్ ఇచ్చేస్తారా? అందులో కౌషల్ సాధించిందేంటి? డాక్టరేట్ లు ఇవ్వడానికి అర్హతలు లేవా? అంటూ మండిపడుతున్నారు.

అలాగే ఇది కూడా డబ్బులు చెల్లించి తీసుకున్న డాక్టరేట్ అని… ఇలా వివిధ రకాలుగా విమర్శలు కురిపిస్తుండగా, ‘బిగ్ బాస్’ సభ్యుడిగా 40 కోట్ల ఓట్లను రాబట్టిన కౌషల్ కు ఏమైనా ఇవ్వొచ్చు అని అభిమానులు సమర్ధించుకుంటున్నారు. అయితే అసలు తనకు ఇవ్వడానికి గల కారణాన్ని దాచిపెట్టి, సస్పెన్స్ ను క్రియేట్ చేసాడు కౌషల్.

ADVERTISEMENT
Latest Stories