బిగ్ బాస్ 2 “విన్నర్” ముందే తెలుస్తుంది!

Bigg boss Telugu2 finalistబుల్లితెరపై విజయవంతంగా ప్రదర్శితం అవుతోన్న ‘బిగ్ బాస్ 2’ నుండి పూజా రామచంద్రన్ అవుట్ అయ్యింది. అయితే ప్రతి వారం మాదిరిగానే ఈ విషయం ముందుగానే లీక్ అయ్యింది. ఆదివారం నాడు ఉదయం నాటికే ‘బిగ్ బాస్ 2’ హౌస్ నుండి ఈ వారం పూజ అవుట్ అన్న విషయం సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. అది సాయంత్రం అయ్యేపాటికి అధికారికం అయ్యింది.

ADVERTISEMENT

[m9ad]

ఇలా ప్రతి వారం ఎలిమినేషన్స్ అన్నీ కూడా ముందుగానే లీక్ అవ్వడం, అవి నిజమవుతుండడంతో… ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే ‘బిగ్ బాస్ 2’ విన్నర్ ఎవరో కూడా ముందుగానే లీక్ కావడం సహజం. గత సీజన్ బిగ్ బాస్ విన్నర్ అయిన శివబాలాజీ పేరు కూడా ముందుగానే లీక్ అయ్యి, నిజమైంది. ఇలా ముందస్తు సమాచారంతో చూస్తే ‘కిక్’ ఏముంటుంది? ఈ ప్రభావమే ఈ సీజన్ టీఆర్పీలపై ప్రభావితం చూపిందని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories