సూపర్ స్టార్… ఒక మంచి వ్యక్తి మాత్రమే… నటుడు కాదు..!

BIIC - Superstar Rajinikanthభారతీరాజా ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సినిమా (బీఐఐసీ) ప్రారంభోత్సవానికి హాజరైన సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ… భారతీరాజా అంటే తనకు చాలా ఇష్టమని, అలాగే ఆయన కూడా తనను బాగా ఇష్టపడతారని చెప్పారు. 40 ఏళ్ల తన సినీ ప్రస్థానంలో కేవలం రెండే రెండు సందర్భాల్లో భారతీరాజా, తాను కలుసుకున్నామని గతాన్ని గుర్తు చేసుకున్నారు. తాను ‘16 వయదిన్నెల్‌’ సినిమాకు కాల్షీట్‌ తీసుకునేందుకు ఒకసారి, మరోసారి ఈ ఫంక్షన్‌ లో అని, తాను కూడా ఒక ఫిలిం ఇనిస్టిట్యూట్‌ విద్యార్థినేనని గుర్తు చేసుకున్నారు.

దివంగత దర్శకుడు కె.బాలచందర్‌ నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని వెల్లడించారు. నైపుణ్యాలను ఎలా మెరుగుపరుచుకోవచ్చో ఫిలిం స్కూల్‌ నేర్పుతుందని తెలిపారు. గతంలో కొంతమంది జర్నలిస్టులు తన గురించి భారతీరాజాను ప్రశ్నించారని… అప్పుడాయన రజనీకాంత్‌ మంచి వ్యక్తి అన్నారని, తానొక మంచి నటుడిని అని భారతీరాజా ఎప్పటికీ అంగీకరించరని చమత్కరించారు. ‘ఆయనను నటుడిగా ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు?’ అని ఇప్పటికీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారని అన్నారు.

ADVERTISEMENT

అనంతరం భారతీరాజా మాట్లాడుతూ, రజనీకాంత్‌ చాలా సాధారణమైన వ్యక్తి అని, ’16 వయదిన్నెల్‌’ చిత్రంలో ఆయన ప్రతినాయకుడి పాత్ర పోషించారని, ఇప్పుడాయన ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారని, అందుకు చాలా సంతోషమని ఆయన తెలిపారు. అలాగే రజనీ జీవితంలో తనది చాలా చిన్న పాత్ర అని, ఆయన సినీ జీవితంలో ఎదుగుదలలో తనది కీలక పాత్ర అని ఎన్నటికీ అననని, స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి రజనీకాంత్ అని భారతీరాజా కొనియాడారు.

ADVERTISEMENT
Latest Stories