బాలీవుడ్ హీరోను కూడా లెక్క చేయాలా!

BMC demolishes actor Arshad Warsi's Versova bungalowప్రముఖ బాలీవుడ్ హీరో అర్షద్ వార్సీకి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. దాదాపుగా నాలుగేళ్ల నుండి సాగుతున్న ఈ సీరియల్ ఎపిసోడ్ కు ఎట్టకేలకు కూల్చివేతతో శుభంకార్డు పడింది. నాలుగేళ్ల క్రితమే అర్షాద్ తన బంగ్లాలో అక్రమ నిర్మాణాలు చేపట్టాడని బీఎంసీ దృష్టికి వచ్చింది. దాంతో కూల్చివేతకు నోటీసులు జారీ చేయగా, అప్పటినుండి ఎప్పటికప్పుడు అర్షద్ కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటున్నాడు.

2012వ సంవత్సరంలో ఎయిర్ ఇండియా కోఆపరేటివ్ సొసైటీలో ఓ ఎయిర్ ఇండియా మాజీ ఉద్యోగి నుంచి అర్షద్ ఈ బంగ్లాను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత బంగ్లాలో అనుమతులు లేకుండా అర్షద్ నిర్మాణాలు చేపట్టాడంటూ సొసైటీ సభ్యులు బీఎంసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ 2013లో బీఎంసీ భావించగా, నాటి నుండి స్టే తెచ్చుకుంటూ తన భవనాన్ని కాపాడుకుంటున్నాడు అర్షద్.

ADVERTISEMENT

అయితే తాజాగా భవనం కూల్చివేతకు సంబంధించి అర్షద్ కు బిఎంసీ నోటీసులు జారీ చేయగా, దానికి ప్రతిగా ఎలాంటి స్పందనను తెలుపక పోవడంతో, భవనంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను బిఎంసీ అధికారులు తొలగించారు. ప్రముఖ హీరోగా బాలీవుడ్ లో ఓ సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్న అర్షద్ ఇంటిని కూడా లెక్క చేయకుండా కూల్చివేయడంపై సామాన్యుల నుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories