బిఎండబ్ల్యూ, ఆడి కార్ల ధరలు కేవలం 5 లక్షలే!

BMW ODI AT 5LAKHSలగ్జరీ కార్లకు పర్యాయపదంగా నిలిచే బిఎండబ్ల్యూ, ఫోర్షే, ఆడి కార్లు కారుచౌకగా లభించనున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా కాదు, ఒక్క చెన్నైలో మాత్రమే! ఇటీవల కురిసిన భారీ వరదలలో చిక్కుకుని అధోగతి పాలైన కార్లను రీ సేల్ మేళా నిర్వహించనున్నారు.

అమెరికా ఆధారిత వేలం నిర్వహణ సంస్థ ఈ బాధ్యతలు తీసుకుంది. ఈ సంస్థ అధికారిక వైబ్‌సైట్ “కోపార్ట్.ఇన్” (copart.in) ద్వారా దాదాపుకు 100 వరకు లగ్జరీ కార్లను అందుబాటులో ఉంచారు. అయితే ఈ సంస్థకు కొన్ని బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు మరియు డీలర్లు కూడా తమ వాహనాలకు సదరు వెబ్‌సైట్ ద్వారా వేలం నిర్వహించాలని కోరినట్లుగా తెలిపారు.

ADVERTISEMENT

2014 మరియు 2015 మోడల్ కు చెందిన కార్లు కూడా ఉన్నాయని, ఆ కార్ల యొక్క కండీషన్ మాత్రం నిర్వాహకులతో సంభందం ఉండదని, కార్లు ఎంచుకునే ముందు అన్నివివరాలు పరిశీలించుకోవాలని తెలిపారు. ఈ వేలం పాటలో బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ కారు 6 లక్షలకు, 2015 మోడల్ ఆడి ఎ4 కారు 3.4 లక్షలకు మరియు పోర్షో క్యానాన్ 2012 మోడల్ కారు 5 లక్షల రుపాయలకు వేలంలో అందుబాటులో ఉన్నాయి. మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే… ముందుగా రిఫండబుల్ డిపాజిట్ తో లాగిన్ కావడమే ఆలస్యం!

ADVERTISEMENT
Latest Stories