బోండా విషయంలో వైసీపీ యూ టర్న్…

Bonda Uma Controversy

ముద్రగడ సంతాప సభ కు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తో కలిసి వేదిక పంచుకున్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా పై అటు టీడీపీ లో అసంతృత్తి ఇటు వైసీపీ లో ఆశ జ్యోతి ఒక్కసారిగా బయటకొచ్చాయి.

టీడీపీ అధిష్టానం బోండా ను వివరణ కోరడం, అందుకు వైసీపీ కాపు నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని బోండా కు మద్దతుగా మీడియా ముందుకొచ్చి తమ గళం వినిపించడంతో బోండా త్వరలో వైసీపీ తీర్ధం పుచ్చుకోబోతున్నారా అంటూ వార్తలు గుప్పుమన్నాయి.

ADVERTISEMENT

అయితే బోండా తనకు ఆ ఉద్దేశం లేదంటూ టీడీపీ శ్రేణులకు ఒక స్పష్టత ఇచ్చినప్పటికీ తాజాగా నేడు విజయవాడ బోండా నియోజకవర్గంలో వైసీపీ vs బోండా అంటూ సాగిన ఒక వివాదంతో దీని పై ఇరు పార్టీల శ్రేణులకు పూర్తి స్పష్టత వచ్చినట్లయ్యింది.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మెగా డీఎస్సీ లో అక్రమాలు అంటూ మల్లాది విష్ణు నేతృత్వంలో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష లో మంత్రి నారా లోకేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపించారు.

దీనితో బోండా తన నియోజకవర్గం లో అధికారుల అనుమతి లేకుండా వైసీపీ చేస్తున్న ఈ నిరసన దీక్షలను నిరువరించే ప్రయత్నం చేసారు. ఈ అనధికారిక దీక్షలా కారణంగా స్థానిక ప్రజలు ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కుంటున్నారని, వెంటనే వైసీపీ నేతలు తమ దీక్షలు విరమించాలని బోండా అనుచరులు వైసీపీ కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

దీనితో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే తమ పార్టీ చేపట్టిన నిరాహారదీక్షను బోండా తన రౌడీ మూకతో భగ్నం చేసారంటూ వైసీపీ నేత పేర్ని నాని బోండా టార్గెట్ గా విమర్శలు మొదలుపెట్టారు. బోండా ఉమా అధికార మదంతో రౌడీలను వెంటేసుకుని మల్లాది విష్ణు చేపట్టిన నిరశన దీక్షను నిరువారించారని,

ఇది ప్రజాస్వామ్యం మీద బోండా చేసిన దాడిగా పరిగణించబడుతుందంటూ నాని బోండాకు వ్యతిరేకంగా గళం విప్పారు. దీనితో బోండా ఉమా విషయంలో వైసీపీ ఇప్పుడు యూ టర్న్ కొట్టిందా అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. ఇటు ఉమా కూడా వైసీపీ లో చేరుతున్నట్టు తన పై వస్తున్న పుకార్లకు సైతం ఈ వివాదం తో చెక్ పెట్టినట్లైయింది. అంటే ఒక్క వివాదం రెండు పార్టీలకు బోండా ఉమా విషయం పూర్తి స్పష్టత ఇచ్చినట్లయింది.

ADVERTISEMENT
Latest Stories