బోయపాటి…నీపై ఇవేం ట్రోల్స్ అయ్యా?

boyapati sreenu trolled for Vinaya Vidheya Rama disasterవరుసగా ఆరు ఏళ్ళు హిట్ లేని బాలయ్యకి హిట్ ఇచ్చి మరో సినిమా లెజెండ్ తో ఇండస్ట్రీ హిట్ ను అందించాడు బోయపాటి. అయితే అప్పటివరకూ తాను తీసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే నిన్న రిలీజ్ అయిన వినయ విధేయ రామ ఒక ఎత్తు అనే చెప్పాలి.

అయితే ఆ మధ్యలో దమ్ము లాంటి సినిమా ఉన్నప్పటికీ వినయ విధేయ రామ అంత దారుణంగా లేదు ఆ సినిమా అన్నది ప్రేక్షకుడి ఆలోచన. పాపం వరుసగా హిట్స్ ఇస్తున్న బోయపాటి నిన్న మెగా ఫాన్స్ చేసిన ట్రోల్ల్స్ కి బలైపోయాడు. బోయపాటి కావాలనే చేసాడు అని కొందరు అంటూ ఉంటే, మరి కొందరు రామ్ చరణ్ బోయపాటిని పూర్తిగా నమ్మాడు…ఆలా నమ్మడమే కొంప ముంచింది అని మరి కొందరి ఆవేదన.

ADVERTISEMENT

ఇదిలా ఉంటే బోయపాటి తన సినిమా కెరీర్ లో ఇంతటి డిజాస్టర్..ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ చూడలేదు అని చెప్పవచ్చు. తులసి లాంటి సినిమాలు భారీ హిట్స్ కాకపోయినా, హిట్ గా నిలిచాయి. అయితే దమ్ము సినిమా మాత్రమే బోయపాటి కెరీర్ లో యావరేజ్ టాక్ ను మూటగట్టుకుంది. ఇక నిన్నటి దెబ్బతో బోయపాటి కెరీర్ కి డిజాస్టర్ అనే మచ్చ ఏర్పడింది అనే చెప్పాలి.

అయితే ఇక్కడ ఇంకో కోణం ఏంటి అంటే, ఈ సినిమా షూటింగ్ టైం లో పెద్ద వాళ్ళు వేలు పెట్టడం వల్లనే రిజల్ట్ ఇలా వచ్చింది అన్న వాదన కూడా వినిపిస్తుంది. ఏది ఎలా ఉన్నా, పాపం బోయపాటి మంచి అవకాశాన్ని చేజార్చుకున్నాడు అని చెప్పక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories