ఎన్నో సినిమాలను తమ కామెడీతో గట్టెక్కించిన ఘనత బ్రహ్మానందం సొంతం. హాస్యానికి రాజులా మారిన అలాంటి బ్రహ్మి, ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం లేదు. పండించే హాస్యంలో కొత్తదనం లేక ప్రేక్షకులను అలరించలేకపోవడం ఓ కారణమైతే, వచ్చిన చిన్న, చితక సినిమాలను పక్కన పెట్టడం కామెడీ కింగ్ వంతవుతోంది. దీంతో బ్రహ్మి కామెడీని ప్రేక్షకులు మిస్ అవుతున్నారన్నది మాత్రం వాస్తవం.
ADVERTISEMENT
[m9ad]
అయితే ఇక ముందు అలాంటి అవకాశం లేదు. మొన్నటివరకు సిల్వర్ స్క్రీన్ పై తళుక్కుమన్న బ్రహ్మానందం, ఇక నుండి బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. బ్రహ్మి హోస్ట్ గా ఓ ప్రముఖ మీడియా ఛానల్ నిర్వహించిన కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా సదరు మీడియా ఛానల్ విడుదల చేసింది. బహుశా ఈ కార్యక్రమం తర్వాత బ్రహ్మి మిస్ అవుతున్నారనే భావన తొలగిపోతుందేమో!?
ADVERTISEMENT



