ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలో నటించాలన్న కోరిక ఎంత మందికి ఉంటుంది? ఈ సంఖ్య చెప్పుకుంటే కాస్త అతిశయోక్తిగా ఉంటుంది కదా! అయితే అందరికీ కాకపోయినా కొన్ని కుటుంబాలకు ఆ అరుదైన అవకాశం “బ్రహ్మోత్సవం” సినిమా ద్వారా కలుగనుంది. అవును… చదివింది నిజమే… ఏకంగా మహేష్ బాబు సినిమాలో నటించే అరుదైన అవకాశాన్ని చిత్ర యూనిట్ కల్పించనుంది. ఈ దిశగా ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన కూడా ఇచ్చేసింది.
వయసుతో నిమిత్తం లేకుండా నిజమైన కుటుంబాలకు సంబంధించి రెండు ఫోటోలను పంపాల్సిందిగా ‘ఈ-మెయిల్’ను ఇచ్చింది చిత్ర నిర్మాణ సంస్థ అయిన పివిపి. ఫ్యామిలీ ఆడియన్స్ అమితంగా ఇష్టపడే మహేష్ సినిమాకు ఇలాంటి బంపర్ ఆఫర్ ప్రకటిస్తే… రెస్పాన్స్ మామూలుగా ఉంటుందా..! ప్రస్తుతానికి అయితే ఆసక్తి ఉన్న ప్రతి కుటుంబం వారి ఫ్యామిలీ ఫోటోలను తీయించుకునే పనిలో నిమగ్నమయ్యుంటుంది కదా! ఆ బంపర్ ఆఫర్ ఎవరికైనా తగలవచ్చు కదా!!





