‘బ్రహ్మోత్సవం’ మేకింగ్ వీడియో టాక్!

brahmotsavam making video talkఆడియో విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రిన్స్ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. దానికి కారణం లేకపోలేదు… తమ అభిమాన హీరో నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా నిర్మాణ సంస్థ పక్కా ప్రణాళికగా పబ్లిసిటీ విషయంలో చేపడుతున్న చర్యలే. మరో 24 గంటల్లో ఆడియో విడుదల ఉంటుందనగా, ‘వచ్చింది కదా అవకాశం…’ పాట మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రు యూనిట్.

‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ ప్రారంభమైంది ఈ పాట చిత్రీకరణతోనే. రామోజీ ఫిలిం సిటీలో దాదాపు 2 కోట్ల భారీ వ్యయంతో ఈ పాట చిత్రీకరణ కోసం సుప్రసిద్ధ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి నేతృత్వంలో వేసిన సెట్ కన్నుల పండుగగా కనపడుతోంది. ముఖ్యంగా చిత్ర ప్రధాన తారాగణం అంతా పాల్గొన్న ఈ పాట ఇప్పటికే సంగీత, సాహిత్య ప్రియులను విశేషంగా అలరిస్తోంది. విజువల్ గా మరింత అద్భుతంగా ఉండబోతుందన్న సంకేతాలు ఈ మేకింగ్ వీడియో స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వైట్ డ్రెస్ లో మెరిసిపోతున్న మహేష్ ను చూసి మురిసిపోవడం అభిమానుల వంతవుతోంది. ముఖ్యంగా ఆడియో వేడుకకు ముందు ఫ్యాన్స్ లో నూతన ఉత్తేజాన్ని నింపడానికి ఈ మేకింగ్ మరింత దోహదపడే విధంగా ఉంది. అలాగే పాటకు తగిన విధంగా ఉన్న డ్యాన్స్ మూవ్ మెంట్స్ వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రత్నవేలు ఫోటోగ్రఫీ, తోట తరణి సెట్స్, సిరివెన్నెల సాహిత్యం, మిక్కీ మ్యూజిక్, మహేష్ మ్యాజిక్… ఈ మేకింగ్ వీడియో హైలైట్స్. ఇంకెందుకు ఆలస్యం… ఓ సారి చూసేద్దాం… అంటూ పాడుకోవడం ప్రిన్స్ ఫ్యాన్స్ వంతవుతోంది..!

ADVERTISEMENT
Latest Stories