రీమేక్ సినిమాల పాటలంటే నిర్లక్ష్యంగా ఉంటారా?

My Dear Markandeyaఒకప్పుడు రీమేక్ సినిమాలంటే ఒరిజినల్ వెర్షన్ చూసే సౌలభ్యం ప్రేక్షకులకు అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడు సీన్ రివర్స్. భీమ్లా నాయక్ అనౌన్స్ చేయగానే ప్రైమ్ కి వెళ్లి అయ్యప్పనుం కోశియుమ్ చూసినవాళ్లు లక్షల్లో ఉన్నారు. దీని వల్ల ఎంత పెద్ద స్టార్ ఉన్నా సరే కథతో సహా దాని బలాలు, బలహీనతలు అన్నీ ముందే తెలిసిపోవడంతో ఆసక్తి ఉండాల్సిన స్థాయిలో కనిపించదు.

ఇది తెలిసినా సరే మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీటిని వదిలే ఉద్దేశంలో లేరు. కారణాలు ఏమైనా స్వంత ఫ్యాన్సే ఇలా ఇన్నేసి రీమేకులు చేయడం పట్ల ప్రతికూలంగా ఉన్న మాట వాస్తవం. సరే ఏదో అభిమానుల కోసమో, పార్టీ కోసమో తీస్తున్నారని సర్దిచెప్పుకున్నా కీలకమైన కొన్ని అంశాల పట్ల శ్రద్ధ వహించాలి. కానీ అదీ జరగకపోతే సోషల్ మీడియా ట్రోలింగ్ కి స్వాగతం చెప్పక తప్పదు.

ADVERTISEMENT

భోళా శంకర్ టైటిల్ సాంగ్ వచ్చి వారాలు దాటేసింది. వ్యూస్ ఎలా ఉన్నా ఆన్ లైన్లో ట్రెండ్ అవ్వడం కానీ, బయట వినిపించడం కానీ పెద్దగా జరగలేదు. చిన్న వయసులోనే దక్కిన మెగా ఆఫర్ ని మహతి స్వరసాగర్ సరిగా వినియోగించుకోలేదు. తండ్రి మణిశర్మలో క్వాలిటీ తగ్గిపోయిన తరుణంలో ఆ గ్యాప్ ని అందిపుచ్చుకుంటే అవకాశాలు ఇవ్వడానికి పదుల సంఖ్యలో నిర్మాతలు రెడీగా ఉన్నారు.

కానీ జరుగుతోంది వేరు. అంటే ఫీలవుతారు కానీ హైపర్ ఆది ప్రాసలతో రామజోగయ్య శాస్త్రి రాసిన ఆ పాట ప్రభావం హైప్ మీద ఎంత మాత్రం లేదని తేలిపోయింది. తాజాగా బ్రో ఫస్ట్ సింగల్ వచ్చింది. మై డియర్ మార్కండేయ అంటూ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, ఊర్వశి రౌతేలాతో పబ్బు సాంగ్ గా షూట్ చేశారు. ఇది కూడా శాస్త్రి గారి కలంలోనే భోళా శంకర్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉంది.

ఎవరిదో కాపీ కొడితే తప్పు కానీ నాది నేనే వాడుకుంటే క్రైమ్ కాదనే తమన్ ఫిలాసఫీకి తగ్గట్టే ఈ సాంగ్ సాగింది. దర్శకుడు సముతిరఖని, పర్యవేక్షిస్తున్న త్రివిక్రమ్ ఎందుకని బెస్ట్ రాబట్టుకోలేకపోయారో. రీమేక్ అంటే సంగీతాన్ని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ హిట్స్ పెదరాయుడు, ఘరానా మొగుడు, ఖుషి లాంటి రీమేక్స్ లో ఒరిజినల్ ని మించిన అదిరిపోయే పాటలు ఉంటాయి.

అలాంటి కమిట్ మెంట్ ఉంటే తప్ప భోళా శంకర్, బ్రోలు లాంటివి అంచనాలు పెంచుకోలేవు. రిలీజ్ రోజు ఓపెనింగ్స్ ఢోకా ఉండకపోవచ్చు. కానీ సామాన్య జనాన్ని ఆకట్టుకోవాలంటే పాటలు కీలక పాత్ర పోషిస్తాయి. కంటెంట్ ఎంత తేడాగా ఉన్నా వారసుడులో రంజితమే, వాల్తేరు వీరయ్యలో వేరీజ్ ది పార్టీలు వేగంగా మాస్ కి ఎక్కేశాయి. కనీసం ఆ మాత్రం కూడా భోళా శంకర్, బ్రోలో లేకపోతే ఎలా. మిగిలిన పాటలైనా న్యాయం చేస్తాయో లేదో లెట్ వెయిట్ అండ్ సీ.

ADVERTISEMENT
Latest Stories