కేసీఆర్ ‘బుడిబుడి’ అడుగులు…!

KCR

బాత్ రూమ్ లో కాలు జారీ పడిపోయిన కేసీఆర్ కు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆరు పదుల వయస్సులో జరిగిన ఈ ప్రమాదం నుండి కేసీఆర్ ఎంత కాలానికి కోలుకుంటారు? ఎప్పుడు తిరిగి నడుస్తారు? అని ఆదుర్దాపడిన పార్టీ నేతలకు, కేసీఆర్ అభిమానులకు ఇప్పుడు కేసీఆర్ వేస్తున్న బుడిబుడి అడుగులు చూసి సంతోషపడుతున్నారు.

చేతి కర్ర సాయంతో, వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ మెల్లగా అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. దీనితో కేసీఆర్ త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని, ప్రజల తరుపున ప్రభుత్వాన్ని నిలతీయాలని బిఆర్ఎస్ నేతలతో పాటుగా కేసీఆర్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

ADVERTISEMENT

రాజకీయ పరంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఇటువంటి కష్ట సమయంలో మాత్రం కేసీఆర్ కు అటు సొంత కుటుంబ సభ్యులతో పాటుగా సొంత పార్టీ నేతలు, ఇటు రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు, పార్టీ నాయకులు సైతం మద్దతుగా నిలవడం రాజకీయాలలో ఉన్నత విలువలకు నిదర్శనంగా చెప్పవచ్చు.అయితే కేసీఆర్ వీడియో ను చూసిన వారంతా “గెట్ వెల్ సూన్ సార్”..! కామెంట్స్ చేస్తున్నారు.

ఏపీలో మాత్రం ప్రతిపక్ష నేత ఆరోగ్యం బాగాలేదు అంటే ఎప్పుడు చేస్తాడో, ఎలా చేస్తాడో అంటూ వెటకారాలు చేసే నాయకులే ఎక్కువ. ప్రత్యర్థుల చావుల మీద రాజకీయ విమర్శలు చేస్తూ తమ రాజకీయ జీవితానికి సమాధులు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కొందరు వైసీపీ నాయకులు. చివరికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పై కూడా కాలు విరిగిందా..? చెయ్యి విరిగిందా..? అంటూ నోరుపారేసుకునే నాయకులను ఒక్క వైసీపీ పార్టీలోనే చూడగలం అంటూ సోషల్ మీడియాలో కొడాలి నాని పై సెటైర్లు పేలుస్తున్నారు .

ADVERTISEMENT
Latest Stories