ఆ హీరోయిన్ మాయలో పవర్ స్టార్?

buzz rakul preet singh to romance pawan kalyanప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే టాప్ హీరోలందరి సరసన నటించింది. జూనియర్ ఎన్టీఆర్ తో ‘నాన్నకు ప్రేమతో,’ రామ్ చరణ్ తో ‘ధృవ,’ అల్లు అర్జున్ తో ‘సరైనోడు’ సినిమాలు చేసిన రకుల్, ప్రస్తుతం మహేష్ బాబు పక్కన “స్పైడర్” చిత్రం చేస్తోంది. ఇంకా రకుల్ చేయాల్సిన హీరోల జాబితాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే ఉన్నారు. అయితే పవన్ తో అవకాశం రకుల్ దరి చేరిందని తెలుస్తోంది.

ADVERTISEMENT

‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించబోయే సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ నటించబోతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్ వర్క్ పట్ల ఫుల్ పాజిటివ్ టాక్ ఉండడంతో, పవన్ కూడా రకుల్ మాయలో పడ్డట్లే కనపడుతోంది.

మరో పక్కన ప్రస్తుతం ‘స్పైడర్’లో రకుల్ డెడికేషన్ చూసిన మురుగదాస్, విజయ్ హీరోగా తను తెరకెక్కించే తదుపరి సినిమాలో కూడా హీరోయిన్ గా రకుల్ నే ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఇలా అగ్ర హీరోలను, దర్శకులను ఆకట్టుకోవడంలో రకుల్ అందరి కంటే ముందు వరుసలో ఉంది. అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పు పొందడంలో సమంత తర్వాత ఆ స్థానాన్ని దక్కించుకున్న హీరోయిన్ గా రకుల్ నిలిచింది. సమంత మాదిరే ఎక్కువ శాతం హిట్స్ కలిగి ఉండడం రకుల్ కున్న అదనపు ఆకర్షణ.

ADVERTISEMENT
Latest Stories