అమెరికాలో దుండగులు మళ్ళీ రెచ్చిపోయారు. కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినో ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లింది. అక్కడి వాటర్ మూన్ అవెన్యూ సమీపంలో సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించగా, మరో 14 మంది గాయపడ్డారు. పోలీసుల ఫైరింగ్ లో ఓ మహిళతో సహా ముగ్గురు దుండగులు చనిపోయారు. శాన్ బెర్నార్డినో లోని వికలాంగుల కేంద్రంలో హాలిడే పార్టీ జరుగుతుండగా మిలిటరీ దుస్తుల్లో వచ్చిన ఆగంతకులు కాల్పులకు తెగబడ్డారు.
కాల్పుల తరువాత నల్ల రంగు వాహనంలో పరారయ్యారు. దుండగుల కోసం సమీప భవనాల్లో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈ కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా ఖండించారు. తరచూ ఇలాంటి ఘటనలు జరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అటు గత నెల 27వ తేదీన ఇదే రాష్ట్రంలోని కొలరాడో స్ప్రింగ్స్ లో ఓ దుండగుని ఫైరింగ్ లో ఓ పోలీసు అధికారి సహా ముగ్గురు మరణించారు.





