సినిమా ఇండస్ట్రీలో అత్యంత దురదృష్ట వంతుడు ఎవరు అంతే నిర్మాత ని చెప్పవచ్చు. ఎందుకంటారా కోటీశ్వరులైన నిర్మాతలకు కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా వెయ్యని స్థితిలో ఉంది ప్రతీ ఇండస్ట్రీ. అయితే దానికి గల కారణాలు ఏవైనా చిన్న సినిమాలు తీసే నిర్మాతల పరిస్థితే కాదు..ఆ సినిమాల పరిస్థితి కూడా అంతే అద్వాన్నంగా ఉంటుంది.
సినిమా రిలీజ్ చేసుకోవడానికి థియేటర్స్ దొరకవు..సినిమా కొనడానికి బయ్యర్స్ ముందుకు రారు. ఇక సినిమా మంచి హిట్ అయినా అవార్డ్స్ రావు..ఎందుకంటే…చిన్న సినిమా కదా. ఇలా ప్రతీ విషయంలో చిన్న సినిమా చిక్కుల్లో పడుతూనే ఉంది..ఇప్పుడు మరో ఉదాహరణగా కంచరపాలెం సినిమాను చూపించవచ్చు.
ఆ సినిమాను నేషనల్ అవార్డు కి ఎంపిక చేసుకోవడానికి నిర్మాత ఇండియన్ కాదంట..ఆమె అమెరికన్ సిటిజెన్ అట..వాహ్ ఏం లాజిక్కు…ఇదే మాట సదరు పెద్దలు…మెగాస్టార్ సినిమాకు గాని, బాలయ్య సినిమాకు గాని, లేదా పవర్ స్టార్ సినిమాకు గాని చెప్పగలరా? ఖచ్చితంగా చెప్పలేరు…
ఎందుకంటే వాళ్ళు బడా తారలు, వారిది బడా సినిమా కదా. కాలాలు మారిపోతున్న చిన్న సినిమా మాత్రం కోమాలోనే ఉండిపోయింది అని స్పష్టంగా చెప్పచ్చు..మరి చిన్న సినిమాలను ఆదుకునే నాధుడు ఎవరో? ఎప్పుడూ వస్తాడో కాలమే నిర్ణయించాలి.



