బన్నీ కారు డ్రైవర్ పై పోలీసులకు ఫిర్యాదు!

case on Allu Arjun Car Driverప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ కారు డ్రైవర్‌ పై హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యలతో కలిసి శనివారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 1లో ఉన్న మోకాబాక్‌ కు వెళ్లాడు. డ్రైవర్ మహిపాల్ రెడ్డి కారును పార్క్‌ చేసి పక్కన కూర్చున్నాడు. అదే సమయంలో మరో క్యాబ్ డ్రైవర్ రామకృష్ణ తన కారును రివర్స్ చేస్తూ అల్లు అర్జున్ కారును ఢీ కొట్టాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మహిపాల్ రెడ్డి దెబ్బ తిన్న తన కారుకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసాడు.

ADVERTISEMENT

అయితే తనకు అంత స్థోమత లేదని సదరు వ్యక్తి ప్రాదేయపడగా, అయితే డబ్బులిచ్చి కారు తీసుకెళ్లమంటూ అతడి కారును తీసుకెళ్లాడు. ఆదివారం ఉదయం మహిపాల్ వద్దకు వెళ్తే 20 వేలు అవుతుందని చెప్పడంతో బతిమాలుకున్నాడు. షోరూముకు వెళితే 2 లక్షలు ఖర్చవుతుందని, కాబ్టటి 20 వేలు ఇవ్వాలని బెదిరించాడు. తనకు అంత డబ్బు ఇచ్చే ఆర్ధిక వెసులుబాటు లేకపోవడంతో కారును బలవంతంగా లాక్కున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రామకృష్ణ పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

ADVERTISEMENT
Latest Stories