చిరంజీవికే మస్కా కొట్టిన చిన్నయ్య!

Theft in chiranjeevi houseవిలన్లను బురిడీ కొట్టించడం అనేది సినిమాలలో హీరోలు అవలీలగా చేసేస్తుంటారు. అయితే అదే హీరోలకు రియల్ లైఫ్ లో చాలా మంది మస్కాలు కొడతారన్న విషయం మాత్రం ప్రేక్షకులకు చాలా అరుదుగా తెలుస్తుంటుంది. అలంటి ఓ సంఘటనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చోటు చేసుకుంది.

ADVERTISEMENT

గత పదేళ్ళుగా ఎంతో నమ్మకంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సర్వర్ గా పని చేస్తున్న చిన్నయ్య అనే వ్యక్తి పలు దఫాలుగా ఇంటి నుండి 2 లక్షల రూపాయలను స్వాహా చేసిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది. దీనికి సంబంధించి జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో చిరు పర్సనల్ మేనేజర్ ఫిర్యాదు చేసారు.

దీంతో నిందితుడు చిన్నయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మెగాస్టార్ తన 151వ సినిమా పనుల్లో బిజీగా ఉండగా, ఆయన సర్వర్ మెగాస్టార్ ను బురిడీ కొట్టించే పనిలో బిజీగా ఉన్నారని తేలింది. ఫైనల్ గా ఈ కేసు ఏమవుతుందో గానీ, ‘చిరు ఇంట్లో చోరి’ అన్న వార్త మాత్రం హాట్ టాపిక్ అయ్యింది.

ADVERTISEMENT
Latest Stories