‘చలాకి చంటి’ జీవితం ‘మటాష్’

Chalaki Chanti wedding‘పెళ్లి’పై కామెడీ ప్రోగ్రాం ‘జబర్దస్త్’ కార్యక్రమంలో ఎన్ని సైటిరికల్ స్కిట్ లు వేసారో అంతే ఉండదు. అయితే ‘పెళ్లి’ కాన్సెప్ట్ వచ్చినప్పుడల్లా ‘హైలైట్’ అయ్యేది మాత్రం ‘చలాకీ’ చంటినే. ‘పెళ్లి’ చేసుకుంటే సంక నాకిపోతుందని ఎన్నో కామెడీ స్కిట్ లు వేసిన అలాంటి చంటి, ఎట్టకేలకు పెళ్లి చేసుకుని సైటైర్లకు శుభంకార్డు వేసాడు.

ADVERTISEMENT

ఇటీవల నిశ్చితార్ధం చేసుకున్న చంటి పెళ్లిని మరో ‘జబర్దస్త్’ కమెడియన్ వేణు ధ్రువీకరించాడు. “మా చంటి గాడికి పెళ్లి అయిందోచ్‌.. నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలి… హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా…” అంటూ ఫేస్ బుక్ ద్వారా శుభాకాంక్షలు చెప్పాడు. అయితే చంటి పెళ్లితో సహచరులే కాదు, అభిమానులు, ప్రేక్షకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెలలోనే ఇద్దరు ‘జబర్దస్త్’ కమెడియన్లకు వివాహం జరగడం మరో విశేషం. ఇటీవలే అరసవల్లిలో షకలక శంకర్ నిరాడంబరంగా వివాహం చేసుకోగా, తాజాగా చలాకీ చంటి వంతు వచ్చింది. ఏ ఇద్దరిపై ఎక్కువగా పెళ్లి జోకులు పేలతాయో, ఆ ఇద్దరూ రోజుల వ్యవధిలో పెళ్లి చేసుకున్నారు.

ADVERTISEMENT
Latest Stories