చిన్న సినిమానే… కానీ చాలా కొత్తగా ఉంది..!

director Challa Srikanthసినిమా నిర్మాణం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సినిమా నిర్మించాలనే తపన, ప్రేమ ఉన్నప్పటికీ ఆర్థికంగా అంత స్తోమత లేనప్పుడు సైలెంట్ గా ఉండటం సహజం. అయితే, అటువంటి వారిని ప్రోత్సహించే నేపథ్యంలో వచ్చిందే ‘క్రౌడ్ ఫండింగ్’. ఈ పద్ధతి ద్వారా సినిమా ప్రియులు, ఔత్సాహికులు ఎవరైనా చిత్ర నిర్మాణంలో భాగస్వాములు కావచ్చు.

ఆ విధంగా రూపొందిన చిత్రమే ‘వశం.’ చల్లా శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రౌడ్ ఫండెడ్ చిత్రం ‘వశం’ ధియేటిరికల్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. స్లోగా ప్రారంభమైన ట్రైలర్ చివరికి వచ్చే సమయానికి తీవ్ర ఆసక్తిని రాబడుతోంది. యోగా వంటి ఒక ప్రత్యేకమైన శక్తితో మరియు ఒక పుస్తకం చుట్టూ తిరిగే అంశంతో ట్రైలర్ చాలా కొత్తదైన అనుభూతిని పంచుతుంది.

ADVERTISEMENT

ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మరియు వెబ్ మీడియాలలో సందడి చేస్తోంది. సినీ నటుడు వైఎస్ కృష్ణేశ్వరరావు, నందకుమార్, వాసుదేవరావు, శ్వేతా వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జోస్యభట్ల శర్మ సంగీతం అందించారు.

ADVERTISEMENT
Latest Stories