చిన్న శ్రీనుకు పెద్ద బాధ్యత.. అరకు పార్లమెంట్

Chandrababu Naidu Assigns Araku Responsibility to Chinna Srinu

విజయనగరం వైసీపీకి పెద్ద దిక్కు బొత్స సత్యనారాయణకు రైట్ హ్యాండ్ వంటి మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆ పార్టీకి పదవులకు రాజీనామా చేసి టీడీపిలో చేరిపోవడం ఆయనకు పెద్ద షాక్. అంత పెద్ద మనిషి నలుగురిలో కంట తడిపెట్టుకునేలా చేసింది.

అయితే ఇప్పుడు చిన్న శ్రీను ద్వారానే చంద్రబాబు నాయుడు వైసీపీకి మరో షాక్ ఇచ్చారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి చిన్న శ్రీనుని టీడీపి పరిశీలకుడుగా నియమించారు.

ADVERTISEMENT

అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ (2009), ఆ తర్వాత వరుసగా మూడుసార్లు వైసీపీ పాగా వేసింది. 2024 కూటమి ప్రభంజనంలో కూడా వైసీపీ (డా.గుమ్మ తనూజ రాణి) గెలిచింది.

ఈ పార్లమెంట్ నియోజకవర్గం కింద ఏడు శాసనసభ నియోజకవర్గాలున్నాయి. వాటిలో అరకు, పాడేరు నియోజకవర్గాలలో వైసీపీయే గెలుచుకుంది.

రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి, మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అరకు ఏజన్సీ ఏరియాల అభివృద్ధికి చాలా కృషి చేస్తోంది. సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ఇద్దరూ ఈ ఏజన్సీ ఏరియాల అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారు.

అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతాలలో పెద్ద ఎత్తున మత మార్పిడులు జరిగినందున, అక్కడ వైసీపీ పట్టు సాధించినట్లు టీడీపి భావిస్తోంది.

కనుక అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి, అక్కడ టీడీపిని బలోపేతం చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలో సిఫార్సు చేసేందుకు సిఎం చంద్రబాబు నాయుడు చిన్న శ్రీనును ఎంచుకున్నారు.

అయన వైసీపీలో ఉన్నప్పుడు టీడీపి, జనసేనల ఒతిళ్ళు తట్టుకుంటూ విజయనగరం జిల్లాలో వైసీపీని బలోపేతం చేశారు.

కనుక ఆయనకే అరకు బాధ్యత అప్పగించారు. తద్వారా అయన రాకతో విజయనగరం జిల్లా టీడీపి శ్రేణులకు ఇబ్బంది కలుగకుండా దూరంగా ఉంచినట్లు కూడా అవుతుంది. అలాగే అరకుపై టీడీపికి పట్టు లభిస్తుంది. కనుక చిన్న శ్రీనుకు ఇది పెద్ద బాధ్యతే అని చెప్పవచ్చు.

Majji Srinivasa Rao Araku

ADVERTISEMENT
Latest Stories