గత వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో పేదవాడి సంక్షేమ బటన్లు నొక్కడానికి మరికొన్ని వర్గాల పై పన్నుల బటన్ నొక్కారు. దీనిలో ట్రూ అప్ చార్జీలతో సామాన్యుడి మీద వైసీపీ బాదిన బాదుడుకు కరెంట్ బిల్లు చూస్తేనే షాక్ కొట్టేటట్టుగా పరిస్థితులు మారిపోయాయి.
ఇక కొత్తగా రాష్ట్రంలో చెత్త పన్ను ను ప్రవేశ పెట్టి, ఉన్న ఆస్తి పన్ను ను రెట్టింపు చేసిన చెత్త ప్రభుత్వం, ప్రజలను బాదే ప్రభుత్వంగా వైసీపీ ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుంది. గత వైసీపీ సర్కార్ పన్నుల భారాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టీడీపీ ‘బాదుడే బాదుడు’ అనే నినాదంతో ప్రజలలోకి దూసుకెళ్లింది.
Also Read – ఎక్కడ నేతలు అక్కడే గప్ చిప్..!
అలాగే అటు ప్రజల నుంచి కూడా టీడీపీ ఎత్తుకున్న ఈ నినాదానికి మంచి స్పందన వచ్చి జగన్ సర్కార్ నిర్ణయాల పై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అప్పుడు బాదుడే బాదుడు అంటూ నినదించిన బాబు ఇప్పుడు విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయంతో విమర్శలు ఎదుర్కుంటున్న నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారనుంది.
రాష్ట్రంలో దిగజారిపోయింది రోడ్ల దుస్థితిని సరిచేయడానికి, మెరుగు పరచడానికి రాష్ట్ర రహదారుల పై కొత్తగా పన్ను విధించడానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనితో ఎన్నికల ప్రచారంలో పార్టీలిచ్చిన ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి రాష్ట్ర ఖజానా కాళీగా ఉండడంతో ఆ భారం బాబు కూడా ప్రజల పైనే నెడుతున్నారు అనే అభిప్రాయం ప్రజలలో మొదలయ్యింది.
Also Read – పాన్ ఇండియా స్థాయిలో వర్మ పాపాల పొద్దు..!
నాడు జగన్ ను, జగన్ పాలనను బాదుడే బాదుడు అంటూ విమర్శించిన బాబు నేడు ప్రజలు పై ఈ బాదుడు బాదడం ఏంటి అంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో వైసీపీ తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయిన ప్రజలు, పన్నుల భారం నుంచి ఊరట చెండానికి, పెరిగిన చార్జీల మోత నుంచి విముక్తి దక్కడానికి గాను164 సీట్లతో కూటమి పార్టీలకు భారీ విజయాన్ని కట్టబెట్టారు.
అయితే అందుకు గాను ప్రజలకు ఈ టాక్స్ ల రూపంలో బాబు గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారా.? అనే వాదన వైసీపీ తెరమీదకు తెచ్చే ప్రమాదం లేకపోలేదు. చెత్త పన్ను నిర్ణయంతో వైసీపీ పట్ల ప్రజలలో కంటికి కనిపించాహ్ని వ్యతిరేకత వచ్చింది, ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో టీడీపీ, జనసేనలు ప్రజలకు జవాబుదారిగా సమాధానం చెప్పాల్సిందే.