జగన్‌ చూడని అభివృద్ధి ఎకనామిక్ టైమ్స్ చూసింది!

నాడు జగన్ పాలనలో రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడుల పరిస్థితి, నేడు చంద్రబాబు నాయుడు పాలనలో ఎలా ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలను ఆకర్షించడంలో చంద్రబాబు నాయుడు తన సామర్థ్యాన్ని మరొకసారి నిరూపించారు. ఆయన కృషి, పట్టుదల, వేగవంతమైన నిర్ణయాలు రాష్ట్రానికి పెట్టుబడులను రప్పించడంలో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

జగన్ హయంలో కనీసం చిన్న ప్రయత్నం కూడా ఈ దిశలో చేయలేదు. సంక్షేమ పథకాలు మాత్రమే రాష్ట్ర అభివృద్ధికి సరిపోతాయని ఆయన నమ్మకం, అభివృద్ధిని విస్మరించడం వల్ల రాష్ట్రం గణనీయంగా నష్టపోయింది. అయినా ఆయన ఇప్పటికీ తన విధానాన్ని సరైనదని వాదిస్తూ, మళ్లీ అధికారంలోకి వస్తే అదే విధానాన్ని కొనసాగిస్తానని ప్రకటిస్తున్నారు.

ADVERTISEMENT

ఆయన చంద్రబాబు నిర్ణయాలను విమర్శిస్తూ, వాటిని వ్యతిరేకిస్తున్నారు. మెడికల్ కాలేజీలు విషయంలో వైసీపీ వైఖరి ఇందుకు తాజా ఉదాహరణ.

చంద్రబాబు గొప్పతనం, సామర్థ్యం, వ్యాపార నైపుణ్యాన్ని జగన్ మరియు వైసీపీ నేతలు అసూయతో అంగీకరించకపోవచ్చు. కానీ ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్-26వ ఎడిషన్‌లో ఆయనను ప్రతిష్టాత్మక “వ్యాపార సంస్కర్త” ((బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్) అవార్డుతో సత్కరించింది.

సిఎం చంద్రబాబు నాయుడు విధానాలను అద్భుతంగా ఉన్నాయని దేశం, అంతర్జాతీయ వాణిజ్య వర్గాలు కూడా గుర్తిస్తున్నాయని ఈ ప్రతిష్టాత్మక అవార్డు సూచిస్తోంది.

ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా వాటి విలువ, వెలుగు ఎన్నటికీ తగ్గదు. సిఎం చంద్రబాబు నాయుడుకి కూడా జగన్‌, కేసీఆర్‌, కేటీఆర్‌ వంటివారి గుర్తింపు అవసరమే లేదు. లోకమే ఆయనని గుర్తిస్తున్నప్పుడు అసూయతో బాధపడుతున్న వారి గుర్తింపు అవసరమా?

 

chandrababu-naidu-economics-times-awards

ADVERTISEMENT
Latest Stories