రాజకీయాలలో ఉండాల్సిన విలువలు ఇవే.!

Chandrababu Naidu KCR

రాజకీయాలలో ఒక పార్టీ మీద మరో పార్టీ దుమ్మెత్తిపోస్తుంటుంది. అలాగే ఒక నాయకుడు మరో నాయకుడి పై విమర్శల జడివాన కురిపిస్తుంటారు. అదంతా కూడా రాజకీయాలలో ఒక భాగం మాత్రమే. నాణానికి మరో మరో వైపు ఉన్నట్టే రాజకీయ నాయకులకు కూడా మరో కోణం ఉంటుంది.

రాజకీయాలలో తన గెలుపు కోసమో తన పార్టీ గెలుపు కోసమో ప్రత్యర్థులకు గిఫ్టులు, రిటర్న్ గిఫ్టులు కూడా ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. కానీ అదే మనసులో పెట్టుకుని ఆపదలో ఉన్న సమయంలో అవకాశం చూసి దెబ్బకొడదాం అని అనుకుంటే ఇక ఆ వ్యక్తికీ రాజకీయ విలువలు లేనట్టే భావించాలి. కానీ కేసీఆర్ విషయంలో ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల నేతలు ఆ రాజకీయ విలువలను పాటిస్తూ ఆసుపత్రిలో,చికిత్స పొందుతున్న కేసీఆర్ ను పరామర్శించడానికి బయలుదేరారు.

ADVERTISEMENT

నిన్న ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ను కలిసి మాట్లాడి కేటీఆర్ కు అండగా నిలబడ్డారు. అలాగే హాస్పటల్ సిబ్బందికి కేసీఆర్ ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేసి తన హుందాతనాన్ని నిరూపించుకున్నారు. తాజాగా నారా చంద్రబాబు కూడా యశోద ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ను స్వయంగా పరామర్శించి త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలంటూ ధైర్యం చెప్పారు. ఈ దృశ్యాలు చూస్తున్న వీక్షకులు మాత్రం రాజకీయాలలో ఉండాల్సిన విలువలు ఇవే కదా అంటూ నిట్టూరుస్తున్నారు.

ఇలా రాజకీయ నాయకుల మధ్య స్నేహపూర్వకమైన పోటీ ఉంటే అది రాష్ట్రానికి మేలు చేస్తుంది. గతంలో రాజకీయ నాయకుల మధ్య ఇటువంటి తత్సబంధాలే ఉండేవి. కాలానుగుణంగా మారుతున్న రాజకీయ వాతావరణంలో ఇటువంటి కనీస రాజకీయ విలువలకు స్థానం లేకుండా పోయింది. ఇప్పటికైనా రాజకీయ పార్టీల అధినేతలు ఇటువంటి విలువలు పాటిస్తే తమ పార్టీ నేతల నుండి క్యాడర్ వరకు వాటిని ఆచరించడానికి అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories