గతంలో ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్న చంద్ర బాబు తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి సోమవారాన్నే పోలవరంగా మార్చుకున్నారు. ఈ రోజు ఉదయాన్నే పోలవర పర్యటనకు బయలుదేరారు.
Also Read – పుష్ప ఎఫెక్ట్ : ఇక నో బెనిఫిట్ షోస్..!
పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించిన చంద్రబాబు ప్రాజెక్ట్ పనుల గురించి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్ ఫోటోలను చూసిన ఆయన 22 , 23 గేట్ల నుంచి రిజర్వాయర్ ను పరిశీలించారు. అనంతరం ఎడమ గట్టు వద్ద కుంగిన గైడ్ బండ్ ప్రాంతాన్ని సందర్శించారు.
ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు తో కలిసి పోలవరం వెళ్లిన బాబు ఈ ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పోలవరం పై చేసిన నిర్లక్ష్యాన్ని ప్రజలకు జ్ఞప్తికి తెచ్చారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు బటన్ నొక్కడానికి మాత్రమే బయటకు వచ్చిన జగన్ ఏనాడూ మంత్రులతో కలిసి ఆయా శాఖల మీద సమీక్షలు జరిపిందే లేదు.
Also Read – వంశీ, కొడాలినే టచ్ చేయలేకపోతే ఇక…
అలాగే ఇరిగేషన్ మంత్రులు గా పని చేసిన అనిల్ కుమార్ యాదవ్ కానీ అంబటి రాంబాబు కానీ పోలవరం మీద ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు. పవన్ ను తిట్టడానికి, బాబు ను ఎద్దేవా చేయడానికి తమ మంత్రిత్వ శాఖలను వినియోగించుకున్న ఈ నేతలు ఇప్పుడు బాబు చేసిన ఈ సమీక్షలకు సిగ్గుతో తల దించుకోవాల్సిందే.
గత ఆనవాయితీని కొనసాగిస్తూ పోలవరాన్ని సమీక్షించడానికి ప్రతి సోమవారం డ్యూటీ ఎక్కుతున్న బాబు తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు.అలాగే గతంలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే ఆనవాయితీ ఉన్న జగన్ కూడా ఇప్పుడు అదే ఆనవాయితీని కొనగిస్తారా.?
Also Read – అప్పుడు ప్యాకేజ్ స్టార్ ఇప్పుడు ఆదర్శవంతుడయ్యాడా..?
అధికారంలో ఉన్నప్పుడు అటు శాఖల మీద సమీక్షలు జరపలేదు, ఇటు కోర్టులకు హాజరవ్వలేదు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఇక అసమీక్షలు చేసే అవకాశం ఎటు లేదు కనీసం తన మీద ఉన్న కేసుల విచారణకు కోర్ట్ కైనా హాజరవుతారా.? అనేది వేచి చూడాలి.