ఆయన్ని అలా వదిలేకండయ్యా… ఎక్కడికైనా తీసుకెళ్ళి చూపించండయ్యా..!

Chandrababu Naidu - Jagan‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో హీరో వెంకటేష్ ను ఉద్దేశించి నటుడు రావు రమేష్ వేసిన సెటైర్ ‘ఆడ్ని అలా వదిలేయకండ్రా… ఎక్కడైనా చూపించండ్రా బాబు…’ ఎంత ప్రజాధరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఇదే డైలాగ్ ను జగన్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జర్నలిస్టులతో వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT

‘దేశంలో ఏవైనా నాలుగు రాష్ట్రాలను ఎంపిక చేసుకుని, అందులో ఓ గ్రామానికి ప్రతిపక్ష నేత జగన్ ను తీసుకెళ్ళి చూపించాలని’ ఓ జర్నలిస్ట్ ను కోరారు. రాష్ట్రంలో జగన్ కు ఇసుక తప్ప ఏం కనపడట్లేదని, అభివృద్ధిని వదిలేసి ఎక్కడో ఏదో జరిగిపోతోందని విమర్శిస్తున్నారని, పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నపుడు ఒకటి, రెండు చోట్ల ఇటువంటివి జరగడం సహజమని అన్నారు.

ఇక, జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసుల విషయమై మాట్లాడుతూ… నీరవ్ మోదీ కంటే జగన్ తక్కువేం కాదని, అవినీతితో ఆస్తులు పోగేశారని పేర్కొన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీపై తాము పోరాడుతుంటే, జగన్‌ పై ఉన్న అవినీతి కేసులను కేంద్రం నీరు గారుస్తోందని, ఐదుగురు ఎంపీలను అడ్డం పెట్టుకుని జగన్ కేంద్రంతో బేరాలాడి కేసుల మాఫీకి కుమ్మక్కయ్యారన్నారని విమర్శించారు.

ADVERTISEMENT
Latest Stories