చంద్రబాబు ఒక మెట్టు ఎక్కినెట్టా? దిగినట్టా?

Chandrababu naidu Wishes YS Jagan Happy Birthdayఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతి పక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్ధులు. అయితే ఏదో కారణంగా జగన్ అది శత్రుత్వంలా భవిస్తూ ఉంటారు. జగన్, చంద్రబాబు వయసుకి, హోదాకి కూడా గౌరవం ఇవ్వకుండా, ఎన్నో సందర్భాల్లో ఏక వచనంతో సంభోదిస్తూ, బూతులు తిడుతూ, తిట్టిస్తూ, చివరికి ఉరి వెయ్యాలి, కాల్చేస్తాను అని కూడా అన్నారు.

నిన్న అందరిని ఆశ్చర్యపరుస్తూ జగన్ కు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు ట్విటర్ ద్వారా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.భగవంతుడి ఆశీస్సులతో పాటు ఆయురారోగ్యాలు ఉండాలని ఆయన కోరారు. అయితే గత సంవత్సరంకూడా చంద్రబాబు అసెంబ్లీ లో ప్రతిపక్షనేత స్థానానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ADVERTISEMENT

అయితే గత ఏడాది జరిగిన ఈ ఘటన అంతా చంద్రబాబు ఏదో తప్పక చేసారు అనుకున్నారు. ఎక్కడో విదేశీపర్యటనలో ఉన్న గుర్తు పెట్టుకుని చంద్రబాబు విషెస్ చెప్పడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. అయితే దీనికి టీడీపీ ఫాన్స్ నుండి వేరువేరు రియాక్షన్లు వచ్చాయి. కొందరికి ఇది ఏమాత్రం నచ్చలేదు.

కొందరుమాత్రం ఈ చర్య ద్వారా చంద్రబాబు తన సంస్కారం, హుందాతనం చూపించారు అని మురిసిపోతున్నారు. సామాన్యుల నుండి కూడా చంద్రబాబు కు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది. మాములుగా చంద్రబాబుని రెండుకాళ్లా చూడని జగన్ కూడా రెస్పాండ్ అవ్వకపోతే ప్రేజలకు చేదు సంకేతాలు వెళ్తాయి అనుకున్నారో ఏమో జగన్ కూడా ధన్యవాదాలు తెలిపారు.

ADVERTISEMENT
Latest Stories