లాంగ్వేజ్… బాడీ లాంగ్వేజ్… అన్నీ మారాయబ్బాయ్..!

Change in mahesh babu dressing styleఒక సక్సెస్ ఎంతటి ప్రభావితం చూపుతుందో చెప్పడానికి నిదర్శనంగా ప్రిన్స్ మహేష్ బాబును పేర్కొనవచ్చు. ‘భరత్ అనే నేను’ సక్సెస్ సంబరాల్లో పాల్గొన్న మహేష్ లోని చేంజ్ ను చూస్తూ అభిమానులు మురిసిపోతున్నారు. ఒకప్పుడు బ్లూ, బ్లాక్ కలర్ షర్ట్స్ తప్ప, మరొకటి ధరించని ప్రిన్స్, ఇప్పుడు కొత్తగా టీ షర్టులతో సినీ వేడుకలపై పాల్గొనడం, మహేష్ లోని చేంజ్ ను బహిర్గతం చేస్తోంది.

అలాగే సినీ వేదికలపై నాలుగు ముక్కలు మాట్లాడాలంటే… ముభావంగా ఉండే మహేష్ నోటి వెంట ఇప్పుడు గలగలా మాటలు వచ్చేస్తున్నాయి. సక్సెస్ వేడుకల్లో యాంకర్ సుమ నుండి మైక్ అందుకున్న మరుక్షణం నుండి ‘లేడీస్ స్పీచ్ లు ఇరగ్గొట్టేసారు’ అంటూ దాదాపుగా నాలుగున్నర్ర నిముషాల పాటు అనర్గళంగా ప్రసంగించిన మహేష్ మాటల్లో సంతృప్తిని, ఆనందాన్ని స్పష్టంగా గమనించవచ్చు. ఇంతకుముందు మహేష్ లో చూడని అంశం ఇది.

ADVERTISEMENT

ఒక్క లాంగ్వేజ్ మాత్రమే కాదు, మహేష్ బాడీ లాంగ్వేజ్ లో కూడా మార్పు ప్రస్పుటంగా తాండవిస్తోంది. అమ్మ పుట్టినరోజు నుండి మొదలైన సక్సెస్, నాన్న పుట్టినరోజు వరకు ఈ షేర్స్ ఇలాగే చెప్తూ ఉండాలనే సమయంలో… మీరు అనుకునే ఈ సూపర్ స్టార్ కు శివ నాలుగేళ్లల్లో రెండు సార్లు లైఫ్ ఇచ్చారని చెప్పే సమయంలో… మహేష్ బాడీ లాంగ్వేజ్ అంతకుముందు ఎన్నడూ చూడనిది. ఈ జోష్ ఎప్పటివరకు ఉంటుందో గానీ, ప్రిన్స్ ను చూస్తుంటే ఫ్యాన్స్ కు మరింత ఉత్సాహం వస్తోంది.

ADVERTISEMENT
Latest Stories