‘కాలం’ చేసిన మరో సీనియర్ నటుడు!

Character Artisit Vinod diedటాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించే ప్రముఖ నటుడు వినోద్ ఈ శనివారం నాడు వేకువజామున తన తుది శ్వాసను విడిచారు. దాదాపుగా 300కు పైగా సినిమాలో అనేక విలక్షణ పాత్రలు పోషించిన వినోద్ ఇప్పటికి డిమాండ్ ఉన్న ఆర్టిస్టే. సినిమా రంగంలోనే కాక, బుల్లితెరపై పలు సీరియల్స్ లోనూ వినోద్ కనిపిస్తూ ప్రేక్షకులకు చేరువ అయ్యారు.

ADVERTISEMENT

అసలు పేరు అరిశెట్టి నాగేశ్వరరావు కాగా, సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వినోద్ గా మారిపోయారు. కెరీర్ తొలినాళ్ళల్లో విలన్ గా క్రూరమైన పాత్రలు పోషించిన వినోద్, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు. ‘చంటి’ సినిమాలో ముగ్గురు అన్నదమ్ములలో ఒకరిగా వినోద్ కు చాలా మంచి పేరు వచ్చింది. అలాగే ‘ఇంద్ర, నరసింహనాయుడు’ వంటి బ్లాక్ బస్టర్స్ లోనూ తనదైన పాత్రను పోషించాడు.

అలాంటి వినోద్ అర్ధంతరంగా వదిలి వెళ్ళడం ఇండస్ట్రీకి తీరని లోటుగా మారింది. దీంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆయన నివాసంలోనే కన్నుమూసినట్లుగా సమాచారం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories