“నేను.. శైలజ…” హిట్ తో మంచి జోష్ లో ఉన్న రామ్ “ప్రేమికుల దినోత్సవం” సందర్భంగా ఓ ట్వీట్ చేసారు. “డియర్ సింగిల్స్… ఏం పర్లేదు… రేపట్నుంచి మళ్ళీ మనదే… హ్యాపీ వాలైంటైన్స్ డే…” అంటూ చేసిన ట్వీట్ కు హీరోయిన్ ఛార్మి ట్వీట్ చేసారు.
దీనికి ప్రతిస్పందించిన ఛార్మి “హహహహ… సూపర్…” అంటూ రామ్ అభిప్రాయానికి ఫిదా అయ్యారు. అంటే పరోక్షంగా వీరిద్దరూ సింగిల్ గానే ఉన్నారని చెప్పకనే చెప్పారు. అంటే ట్రై చేసుకునే వాళ్లకి ఒక హింట్ ఇచ్చినట్లే కదా! మరి మన హరి గాడి ప్రేమకథలో ‘శైలజ’ ఎప్పుడు ఎంటర్ అవుతుందో..? అంటూ నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT



