నేలపై అమెరికా విమానాలు.. ఆకాశంలో చైనా తొలి విద్యుత్ విమానం

China CE-25A electric aircraft test flight

సాంకేతిక సమస్యల కారణంగా ఓ పక్క అమెరికాలో వేలాది విమానాల రాకపోకలు నిలిచిపోతుంటే.. మరోపక్క చైనా మొట్ట మొదటి పైలట్ రహిత, విద్యుత్ (చార్జింగ్) విమానం సీఈ-25ఏని శనివారం విజయవంతంగా పరీక్షించింది.

దీనిని ప్రయోగాత్మకంగా నడిపిస్తున్నందున, అత్యవసరమైతే విమానాన్ని నియంత్రించేందుకు ఇద్దరు పైలట్స్, ఒక ఫ్లైట్ టెస్ట్ ఇంజినీర్‌ కాక్‌పిట్‌లో ఉన్నారు. వారి పర్యవేక్షణలో ఈ విమానం టేకాఫ్ చేసి కొంతసేపు గాల్లో ప్రయాణించి మళ్ళీ దానంతట అదే సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

ADVERTISEMENT

ఈ విమానాన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 400 కిలోమీటర్లు ప్రయాణించగలదు. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో, 2,400 మీటర్ల ఎత్తులో ప్రయాణించేలా రూపొందించారు. దీనిలో 19 మంది ప్రయాణించడానికి వీలుగా ఈ విమానాన్ని రూపొందించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 2న తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఇది గాల్లో ప్రయాణించింది. మళ్ళీ నిన్న అంటే నవంబర్ 14న మరో పరీక్షా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.

అయితే ఈ విమానానికి మరిన్ని పరీక్షలు నిర్వహించి అవసరమైన అనుమతులు పొందాల్సి ఉంటుంది. అవన్నీ పూర్తయితే విమానయాన రంగంలో చైనా తొలి విద్యుత్ విమానాల ఉత్పత్తి మొదలుపెట్టి అందుబాటులోకి తెస్తుంది.

ADVERTISEMENT
Latest Stories