చిన్మయిని బ్యాన్ చేసారు!

Chinmayi Sripaada banned from tamil dubbing associationసమంతకు డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ గా చిన్మయి శ్రీపాద తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితమే. ‘ఏ మాయ చేసావే’ సినిమాతో కెరీర్ మరో మలుపు తిరిగిన చిన్మయి, ఇటీవల గాయనిగా కూడా మరో అవతారం దాల్చారు. కెరీర్ పతాక స్థాయిలో ఉండగా, ప్రస్తుతం తమిళ డబ్బింగ్ యూనియన్ ఆమెను బ్యాన్ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా శ్రీపాదనే ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది.

ADVERTISEMENT

[m9ad]

‘గత రెండేళ్లుగా తాను మెంబర్ షిప్ చెల్లించనందుకు గానూ మెంబర్ షిప్ ను రద్దు చేస్తున్నట్లుగా తమిళనాడు ఫిల్మ్ అండ్ డబ్బింగ్ యూనియన్ తనకు సందేశం పంపించారని’ వాపోయింది. ఇది కేవలం పేపర్ మీద కాకుండా మెస్సేజ్ రూపంలో పంపడం విచారకరమని అన్న చిన్మయి, తాను మెంబర్ షిప్ ఫీజు చెల్లించనందుకు తనకు వచ్చే ఆదాయంలో 10శాతం మొత్తాన్ని డబ్బింగ్ యూనియన్ తీసుకుంటున్నట్లుగా తెలిపారు.

తనకు మళ్ళీ మెంబర్ షిప్ వస్తుందో రాఎదో తెలియదు గానీ, ఒకవేళ రాకపోతే మాత్రం ఇటీవల విడుదలైన “96” సినిమానే తమిళంలో తన చివరి చిత్రం అవుతుందని…. ఆవేదన వ్యక్తం చేసింది. స్టార్ స్టేటస్ గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి పైనే వేటు వెనుక కేవలం మెంబర్ షిప్ ఫీజు ఒక్కటే కారణం అంటే నమ్మశక్యం కావడం కష్టమే. మరి లోగుట్టు ఎవరికీ ఎరుకో గానీ, ఈ అంశం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.

ADVERTISEMENT
Latest Stories