మెగా అభిమానుల్లో ‘అసహనం’ కట్టలు తెంచుకుంటోందా?

dussera mega fans over chiranjeevi 150 movieఅభిమానం పేరుతో మెగా ఫ్యాన్స్ చేసే చేష్టలు ఎలా ఉన్నప్పటికీ తమ అభిమాన హీరో మెగాస్టార్ చేస్తున్న ‘వాయిదా’ ప్రకటనల పట్ల ‘అసహనం’ పెరిగిపోతోంది. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు ముందు నుండి ప్రచారంలో ఉన్న మెగాస్టార్ మెగా మూవీ 150వ సినిమా సంగతులు అదిగో… ఇదిగో… అంటూ ఏడెనిమిది ఏళ్ళు గడిపేసారు. ఎప్పుడు తమ అభిమాన హీరో నుండి ఈ ప్రతిష్టాత్మక సినిమా ప్రకటన వస్తుందా అని ఎదురు చూడని ‘మెగా’ అభిమాని లేరు.

ఇటీవల కాలంలో ఈ ఉధృతి ఇంకాస్తా ఎక్కువైంది. 2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాల పుణ్యమా అంటూ మెగాస్టార్ కు పూర్తి స్థాయిలో విశ్రాంతిని కలిగించడంతో ఇక 150వ ప్రకటన అతి త్వరలోనే అంటూ 18 మాసాల నుండి వేచి చూస్తున్నారు. మధ్యలో మెగాస్టార్ రెండు పుట్టినరోజులు కూడా వెళ్ళిపోయాయి. అలాగే మధ్య మధ్యలో “ఆటో జానీ, కత్తి” అంటూ సుత్తి కబుర్లు తెర పైకి వచ్చినా ప్రయోజనం లేకపాయే..! ఇటీవల “బ్రూస్ లీ”లో చేసిన అతిధి పాత్రకు లభించిన ఆదరణ అంతంత మాత్రమే..!

ఇక, దేశమంతా ఊపేస్తున్న ‘అసహనం’ మెగా అభిమానుల్లో సైతం కట్టలు తెంచుకుంటున్న సమయంలో… తాజాగా 2016 సంక్రాంతికి 150వ సినిమా ప్రకటన అంటూ ఓ సమాచారం హల్చల్ చేస్తోంది. సినిమా కధ సంగతి ఎలా ఉన్నా, ముందుగా డైరెక్టర్, నిర్మాత, హీరోయిన్, సంగీత దర్శకుడు వంటి ప్రధాన అంశాలను సంక్రాంతి సమయానికల్లా ప్రకటించాలని ‘మెగా’ కాంపౌండ్ ఊవ్విళ్ళూరుతోందట! మరి చూద్దాం… ఈ సారైనా ఆ ‘మెగా’ ప్రకటన వస్తుందో లేదో..!

ADVERTISEMENT
Latest Stories