మెగాస్టార్ విత్ ‘సన్’ అండ్ ‘డాటర్’

chiranjeevi-and-konidela-susmitha-on-the-ram-charan-boyapati-movie-setsమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ స్పాట్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్న విషయం తెలిసిందే. ఇటీవలే చిత్ర యూనిట్ అధికారికంగా డిక్లేర్ చేసిన ఈ విషయంపై తాజాగా ఓ ఫోటో బయటకు వచ్చింది. ఈ సినిమా సెట్స్ పై రామ్ చరణ్, సుశ్మితలతో పాటు మెగాస్టార్ ఉన్న ఈ పిక్ మెగా ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ లా మారింది.

[m9ad]

ADVERTISEMENT

కాస్ట్యూమ్ డిజైనర్ గా సుశ్మిత అటు తండ్రి “సైరా” సినిమాకు, ఇటు సోదరుడు సినిమాకు పని చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో తండ్రి కొడుకుల నడుమ సుశ్మిత కూడా చేరి, ఈ ఫోటోను మెగా ఫ్యామిలీ పిక్ గా మార్చేసింది. సంక్రాంతి నాటికి విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను దసరాకు విడుదల చేస్తారనే టాక్ ప్రచారంలో ఉంది గానీ, నిర్మాత డివివి దానయ్య గారైతే ఇంతవరకు ఏమి ప్రకటించలేదు.

ADVERTISEMENT
Latest Stories